Ex CM KCR : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన బీఆర్ఎస్ కీలక నేతలు

గత ఏడాది డిసెంబరులో అధికారం చేపట్టిన వెంటనే విగ్రహం రూపకల్పనపై రేవంత్ ప్రభుత్వం దృష్టిసారించింది...

KCR : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇవాళ మధ్యాహ్నం 1:30గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కలవనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌(KCR)ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున స్వయంగా ఆహ్వానించనున్నారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలతో ఉందని, తెలంగాణ ఆనవాలు లేదంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే అసలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి, ఆవిష్కరిస్తామని చెప్పింది. అన్నట్లుగానే.. గత ఏడాది డిసెంబరులో అధికారం చేపట్టిన వెంటనే విగ్రహం రూపకల్పనపై రేవంత్ ప్రభుత్వం దృష్టిసారించింది.

Ex CM KCR Meet…

ఇందులో భాగంగానే తెలంగాణ సచివాలయం ప్రధాన ద్వారం ఎదుట రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది. 3 అడుగుల గద్దెపై 17 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తున్న కాంస్య విగ్రహ నమూనాను శుక్రవారం విడుదల చేసింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఈనెల తొమ్మిదో తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించనుంది. బంగారు రంగు అంచుతో ఆకుపచ్చ చీర! రెండు చేతులకు ఎరుపు, ఆకు పచ్చ రంగు గాజులు! ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ కంకులు! కాళ్లకు మెట్టెలు, పట్టీలు! మెడలో బంగారపు గొలుసులు! నుదుట రూపాయి కాసంత ఎర్రటి బొట్టుతో నిండైన గ్రామీణ మహిళ రూపంతో తెలంగాణ తల్లి తాజా విగ్రహాన్నిరేవంత్ ప్రభుత్వం రూపొందించాచింది. సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ విగ్రహం రూపుదిద్దుకుంది.

Also Read : CM Revanth Reddy : డ్రగ్స్ రవాణా దారులకు ఘాటు వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!