CM Chandrababu : రెవెన్యూ సమస్యల పరిష్కారం ఆలస్యానికి అధికారులపై భగ్గుమన్న సీఎం
CM Chandrababu : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇవాళ(గురువారం) ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు.
CM Chandrababu Comments
రెవెన్యూ సదస్సుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ అందడంతో అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఎప్పుడు పరిష్కారం అవుతాయి, ఎందుకు కావడం లేదని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. త్వరలోనే పరిష్కారం అవుతాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పారు.మీకు ఓపిక ఉంది…ప్రజలకు ఓపిక ఉండాలి కదా? ప్రజలు ఎన్ని రోజులు ఎదురు చూస్తారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 22ఏ భూములు, ఇళ్ల స్థలాలు వెంటనే ఎందుకు పరష్కరించలేదని నిలదీశారు. మొత్తం సమస్యలు పరిష్కారం చేసి ఒక రిపోర్ట్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
Also Read : CM Mamata : బెంగాల్ సీఎం ‘బీఎస్ఎఫ్’ పై చేసిన ఆరోపణలకు స్పందించిన బీజేపీ