CM Chandrababu : ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి కీలక భేటీ
రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో బాబు పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు...
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో బాబు పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. నిన్న(బుధవారం) సాయంత్రం సీఎం హస్తిన చేరుకున్నారు.
CM Chandrababu Meet
ఇవాళ ఉదయం వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన సీఎం ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం బాబు ప్రధానిని కలవనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో, 2 గంటలకు వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, 2.45 గంటలకు హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు.
రేపు (శుక్రవారం) ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 10.45 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర ఆర్థిక, రాజకీయ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రులతో చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 12.30. అనంతరం పలువురు వ్యాపారవేత్తలను, జపాన్ రాయబారిని కలుస్తారు. అనంతరం శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
Also Read : Deputy CM Pawan : ఇకనుంచి సంపూర్ణంగా పిఠాపురం నా సొంత నియోజకవర్గం