CM Revanth Reddy Meet : కీలక అంశాలపై ఢిల్లీ కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు...

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం నాడు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో ఓ వివాహ వేడుకకు హాజరైన సీఎం ఇవాళ(గురువారం) ఢిల్లీకి చేరుకున్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర మంత్రులతో కీలక భేటీలు నిర్వహించనున్నారు.

CM Revanth Reddy to Meet..

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సీఎం సమావేశం కానున్నారు. రాత్రి ఏడు గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. చర్చల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

Also Read : Grandhi Srinivas Resign : ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసిన మరో మాజీ ఎమ్మెల్యే

Leave A Reply

Your Email Id will not be published!