CM Siddaramaiah : తప్పుడు కేసులతో నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టారని ప్రస్తుతం నన్ను, నా భార్యను టార్గెట్‌ చేశారన్నారు...

CM Siddaramaiah : తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారని, నేను 40ఏళ్ల క్రితమే మంత్రిని అయ్యానని, 14 ఇంటి స్థలాలకోసం ఎందుకు తప్పు చేస్తానని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రశ్నించారు. టి నరసీపురలో బుధవారం రూ.470 కోట్లతో అభివృద్ధి పనులు, సంక్షేమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీలను దుర్వినియోగం చేస్తోందన్నారు.

CM Siddaramaiah Comment

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టారని ప్రస్తుతం నన్ను, నా భార్యను టార్గెట్‌ చేశారన్నారు. బీజేపీ రాష్ట్రంలో ఇప్పటివరకు సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ఆపరేషన్‌ కమల ద్వారా మాత్రమే అధికారంలోకి వచ్చిందని, ఈసారి 50 మంది ఎమ్మెల్యేలకు తలా రూ.50కోట్లు ఆఫర్‌ ఇచ్చారని ఆరోపించారు. యడియూరప్ప, బొమ్మై, అశోక్‌లకు ఇంత సొమ్ము ఎక్కడనుంచి వచ్చిందని, వారేమైనా ప్రింట్‌ వేశారా..? అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఐదు గ్యారెంటీల అమలుపై బీజేపీ, జేడీఎస్‌ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1.20 లక్షల కోట్లు అభివృద్ధికి కేటాయించిందన్నారు. టి నరసీపుర రూపురేఖలు మారనున్నాయన్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మహదేవప్పతోపాటు మంత్రులు వెంకటేశ్‌, ఎంసీ సుధాకర్‌, ఎంపీ సునిల్‌బోస్‌, గ్యారెంటీ అమలు కమిటీ వైస్‌ చైర్మన్‌ పుష్ప అమరనాథ్‌, ఎమ్మెల్సీలు యతీంద్ర సిద్దరామయ్య, డాక్టర్‌ తిమ్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.

Also Read : Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల ఎదుట హాజరుకానున్న నకిరేకల్ ఎమ్మెల్యే

Leave A Reply

Your Email Id will not be published!