ప్రతి పదిమందిలో ఒకరికి కరోనా వైరస్

నిర్ఘాంతపోయే నిజాలు చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)

జెనీవాలోని డబ్ల్యూహెచ్ఓ కార్యాలయంలో కోవిడ్ వ్యవహారంపై చర్చించడానికి అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి పదిమందిలో ఒకరు కోవిడ్ బారిన పడినట్టు సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. కరోనా వైరస్ ప్రాంతానికి ఒకలా మారుతోందనే విషయాన్ని తెలిపారు.

అంటే పల్లెల్లో ఒకలా, పట్టణాల్లో ఒకలా, నగరాల్లో ఒకలా, రాష్ట్రాల్లో,దేశాల్లో, ఖండాల్లో ఇలా ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క తరహాలో తన విశ్వరూపాన్ని చూపిస్తోందని కొన్ని చోట్ల తక్కువగా ఉందని, కొన్ని చోట్ల ఎక్కువగా ఉందని వివరించారు. అంతేకాదు ప్రపంచంలోని ఎక్కువశాతం ప్రజలు ఇంకా రిస్క్ జోన్ లోనే ఉన్నారని, కరోనా తగ్గిపోయిందని, ప్రభావం తగ్గిందని భావించవద్దని, తేలికగా మాత్రం తీసుకోవద్దని ప్రపంచ దేశాలను, ప్రజలను కోరారు.

ప్రపంచంలోని ప్రతి దేశం, అక్కడ ప్రజలు ఎప్పటిలాగే తమ దైనందిన పనుల్లో పడిపోయారు. దాని దారి దానిదే..మన దారి మనదే అన్నట్టు సాగిపోతున్నారు. అది కరెక్టు కాదు.. కోవిడ్ పై ప్రపంచదేశాలన్నీ కలిసికట్టుగా పోరాడాలని డబ్ల్యూహెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ పేర్కొన్నారు. ఇంకా మాట్లాడుతూ ప్రపంచంలోని పది దేశాల్లోనే అధికంగా అంటే 70 శాతం కేసులు ఉన్నట్టు తెలిపారు.

అందులో సగం మరణాలు అమెరికా, భారత్, బ్రెజిల్ మూడు దేశాల్లోనే అధికంగా ఉన్నాయని తెలిపారు. ముందు ఆ దేశాలు, అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు కేవలం 3.5 కోట్లమందికి మాత్రమే వైరస్ సోకినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని, వాస్తవానికి ఈ సంఖ్య 80 కోట్ల వరకు ఉండవచ్చునని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోందని తెలిపారు.

 

Leave A Reply

Your Email Id will not be published!