Deputy CM Pawan : ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని అందజేసిన పవన్ కళ్యాణ్
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు...
Deputy CM Pawan : వరద బాధితులకు సహాయం చేయడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరదలు ప్రజలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి చొప్పున విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోని 400 పంచాలయతీలకు ఒక్కో దానికి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల సొంత నిధులను విరాళంగా ప్రకటించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని పవన్ పేర్కొన్నారు.
Deputy CM Pawan Given..
ఇదిలా ఉండగా… ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు (శనివారం) ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటిని ఉపముఖ్యమంత్రి అందజేశారు. విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును చంద్రబాబుకు పవన్ అందజేశారు. పవన్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ ఆరోగ్యంపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు.
Also Read : Telangana IPS Officers : తెలంగాణలో ఐపిఎస్ ల బదిలీల్లో హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్