Deputy CM Pawan : ఇకనుంచి సంపూర్ణంగా పిఠాపురం నా సొంత నియోజకవర్గం

ప్రస్తుతం పిఠాపురంలో ఒక హెక్టారు భూమి విలువ 16 లక్షల నుండి 20 లక్షల వరకు ఉంది...

Deputy CM Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పవన్ ఇప్పటికే నాలుగు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేసి తన కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. పిఠాపురంలో మరో ఇంటిని నిర్మించాలని నిర్ణయించారు. దీంతో బుధవారం స్థలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు ప్లాట్లు సేకరించారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు రిజిస్ట్రేషన్ పూర్తయింది. పిఠాపురంలో నివాసం ఉండేందుకు రెండెకరాల స్థలంలో క్యాంపు కార్యాలయం, మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మిస్తానని తన నియోజకవర్గ ప్రజలకు పవన్ హామీ ఇచ్చారు.

Deputy CM Pawan Comment

ప్రస్తుతం పిఠాపురంలో ఒక హెక్టారు భూమి విలువ 16 లక్షల నుండి 20 లక్షల వరకు ఉంది. అంతేకాదు మరో 10-15 ఎకరాలు తోటలను కొనుగోలు చేసే పనిలో పవన్ ఉన్నాడు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు ఇప్పటికే ఐదుగురు సహాయకులను నియమించారు. నియోజకవర్గంలో తరచూ పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Also Read : K Keshava Rao : బీఆర్ఎస్ షాక్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరిన మరో సీనియర్ నేత

Leave A Reply

Your Email Id will not be published!