Deputy CM Pawan : కొండగట్టు అంజన్నని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు...

Deputy CM Pawan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Deputy CM Pawan Visit

రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్‌కు పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎన్నికలకు ముందు వారాహి కారుకు పూజలు చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయలుదేరారు.

Also Read : Amaravathi Updates : అమరావతి పై సంచలన అప్డేట్ ఇచ్చిన సిఆర్డిఏ

Leave A Reply

Your Email Id will not be published!