అప్పుడే స్కూళ్లు వద్దు బాబోయ్

అన్ లాక్ పేరిట అన్నింటికి అనుమతులిచ్చేస్తున్న కేంద్రం

ప్రపంచంలో చాలా దేశాలు..భారత్ తో సహా అన్నీ కూడా అన్ లాక్ డౌన్ పేరిట.. నిబంధనలన్నీ ఒకొక్కటిగా ఎత్తివేస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో రెండు జడ్పీ స్కూళ్లలో సుమారు 27 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు, స్కూల్ మాస్టర్లు, సిబ్బంది, గ్రామస్తులు అందరూ ఆందోళన వ్యక్త చేస్తున్నారు..

వారు 9,10 తరగతి విద్యార్థులు.. ఊహ తెలిసిన వారికే వచ్చేసినప్పుడు.. చిన్నపిల్లలను బడికి పంపించమంటే..ఎలా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు.. ఇప్పుడా విద్యార్థులు ఎవరెవరిని కలిశారు.. ఎక్కడ కలిశారని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. పిల్లల్ని హోమ్ క్వారంటైన్ లో ఉంచాలని సూచించారు. అక్కడ విద్యార్థులు లిసిన అందరికీ పరీక్షలు చేశారు. అలాగే వారు వచ్చిన ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పరీక్షలను వేగవంతం చేస్తున్నారు.

ఒకవైపు పరిస్థితులు ఇలా ఉంటే, మరోవైపు నిబంధనలు సడలించుకుంటూ పోతే.. ఎలా? అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక సంవత్సరం ఆగిపోవడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా నాలుగేళ్లు ఉన్న ఇంజనీరింగ్ ఐదేళ్లు పెంచండి..మూడేళ్లున్న డిగ్రీ నాలుగేళ్లు, పదో తరగతికి వస్తే..విద్యా సంవత్సరాన్ని పొడిగించండి..ఏ తరగతిలో ఉన్నవారిని అక్కడే ఉంచండి..వీరందరూ ఒక సంవత్సరం ముందు బయటకు వచ్చినా..తర్వాత వచ్చినా ఒకటే.. ఉద్యోగ, విద్య అవకాశాల్లో మాత్రం ఈ ఒక్క సంవత్సరం సడలింపు ఇవ్వమని కోరుతున్నారు.

 

Leave A Reply

Your Email Id will not be published!