#KamalaHarris : కమలా హారీస్-మైక్ పెన్సు మధ్య చప్పగా డిబేట్
ఒక పార్టీపై ఒకరు ఆరోపణలు, విధానాలపై విమర్శలు
Kamala Harris : అయితే వీరి మధ్య కూడా తీవ్రంగా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ వారి ఊహలను తలకిందులను చేస్తూ.. ఆ అధ్యక్షుల మధ్య జరిగిన డిబేట్ వేడి చల్లార్చడానికన్నట్టు..ఇక్కడ వీరిద్దరూ గౌరవప్రదంగా మాట్లాడుకున్నారు. దాంతో వాతావరణం, మాటలు చప్పగా సాగినట్లు చెప్పాలి. అయితే ఆరోపణల తీవ్రత మాత్రం వీరిమధ్య ఎక్కువగా సాగింది.
డిబేట్ మొదలవగానే మొదటి ప్రశ్న..కమలా సంధించారు. అది ఫాస్ట్ బాల్ పడింది..అంటే కరోనా పై మీరేం చర్యలు తీసుకున్నారు.? మీ అధ్యక్షుడు ట్రంప్ కరోనాని లైట్ గా తీసుకోవడం వల్ల ఈరోజున 2లక్షలమంది అమెరికన్లు చనిపోయారని విమర్శించారు. అందుకు అధికార రిపబ్లికన్ అభ్యర్థి మైక్ పెన్స్ మాట్లాడుతూ మేం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఆ మాత్రం నష్టం నుంచి బయటపడ్డాం..లేదంటే 20లక్షలమంది మరణించేవారని ఆయన సమాధానమిచ్చారు.
అందుకు కమలా మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ అధ్యక్షుడు ట్రంప్ చెబితే, నాతో సహా ఎవరూ వేయించుకోరని.. ఎందుకంటే ఆయనపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు.
అందుకు మైక్ పెన్స్ సమాధానమిస్తూ ప్రజల ప్రాణాలతో ఎవరూ రాజకీయాలు చేయరని, వ్యాక్సిన్ పై దుష్ప్రచారం బాధ్యతగల వ్యక్తులు చేయకూడదని బదులిచ్చారు. రికార్డు సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
ఇలాగే ప్రశాంతంగా..హడావుడి లేకుండా మాట్లాడుకున్నారు. అధ్యక్షుడుకి కరోనా రావడంతో వీరిద్దరి మధ్య ఒక అద్దాన్ని పెట్టారు. ఆరోజు కార్యక్రమం నిర్వహించే జర్నలిస్టు సుజాన్ పేజ్ తో సహా అందరికీ కరోనా పరీక్షలు చేయడం విశేషం.