Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి ఊహించని షాక్ ఇచ్చిన గన్నవరం పోలీసులు

కాగా..గతంలో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు...

Vallabhaneni Vamsi : వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి బిగ్ షాక్ తగిలింది. వంశీ ముఖ్య అనుచరులు ఆరుగురుని గన్నవరం పోలీసులు ఇవాళ(మంగళవారం) అరెస్ట్ చేశారు. ఆయన ముఖ్య అనుచరులు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఓలుపల్లి మోహన్ రంగ, భీమవరపు యతేంద్ర రామకృష్ణ (రాము), అనగాని రవి, మేచినేని వెంకటేశ్వరరావు (బాబు), గుర్రం అంజయ్య(నాని) గోనూరి సీనయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రదేశాల్లో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Vallabhaneni Vamsi Case..

కాగా..గతంలో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం దగ్గరలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో ఆయనను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తుండగా వాహనాన్ని అనుసరించి అదుపులోకి తీసుకున్నారు. వంశీ(Vallabhaneni Vamsi) ఇంటికి సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి వేర్వేరు కార్లలో గన్నవరం వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆయనను పోలీసులు ట్రాక్ చేశారు. వంశీ వేరే మొబైల్ నంబర్ ఉపయోగిస్తున్నారని పోలీసులకు తెలిసిపోయింది. దీంతో వంశీ వాహనాన్ని పోలీసులు గమనించారు. వాహనాన్ని అనుసరించి ఇంటికి సమీపంలోనే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వల్లభనేని వంశీ ఏ1గా ఉన్నారు. ఈ కేసులో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడికి ప్రోద్బలం ఇచ్చింది వల్లభనేని వంశీయేనని వాంగ్మూలం ఇచ్చారు. దీంతో వంశీని ఈ కేసులో ఏ1గా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయనని అరెస్ట్ చేశారు. ఇదికాకుండా వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు కోర్టు ఆవరణలోనే బరి తెగించారు. ప్రత్యర్థులపై దాడులకు ప్రయత్నించారు. ఈ ఘటన విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆవరణలో గతంలో జరిగింది. 2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు ఉన్నారు. ఆ సమయంలో జరిగిన గొడవపై ఇరు వర్గాలపైనా కేసులు నమోదు చేశారు. తర్వాత వంశీ వైసీపీలోకి వెళ్లినా ఆయన అనుచరులు చాలామంది టీడీపీలోనే ఉన్నారు. యార్లగడ్డ టీడీపీలో చేరడంతో గన్నవరం రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read : Yogi Adityanath : మరోసారి బుల్డోజర్ సిద్ధమంటున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Leave A Reply

Your Email Id will not be published!