Gudivada MLA : ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రజల వద్దకు ఎమ్మెల్యే

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు...

Gudivada MLA : ఎమ్మెల్యే అంటేనే ఆయన చుట్టూ గన్‌మెన్‌లు, వ్యక్తిగత సిబ్బంది, కార్యకర్తలు ఉంటారు. ఎక్కడికి వెళ్లిన ఆయన వెంట భద్రతా సిబ్బంది ఖచ్చితంగా ఉంటారు. ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి పనులు చేసినా, ప్రజలను కలిసినా మీడియాలో వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ప్రజల వద్దకు వెళ్లారు ఎమ్మెల్యే. బైక్‌పై వీధుల్లో తిరుగూతూ ప్రజలతో ముచ్చటించారు. ద్విచక్రవాహనంపై తిరుగుతున్న ఎమ్మెల్యేను వీడియో తీసిన కొందరు వాహనదారులు దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. బైక్‌పై తిరుగుతూ ఆయన చేసిన పనులేంటో ఇప్పుడు చూద్దాం.

Gudivada MLA Viral

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము(Venigandla Ramu) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ప్రజలారా ప్రశ్నించండి… మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందంటూ’’ ద్విచక్ర వాహనంపై గుడివాడ వీధుల్లో తిరిగారు ఎమ్మెల్యే. గన్ మ్యాన్, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే రాము పర్యటించారు. రోడ్ల వెంబడి చిరు వ్యాపారులు, దుకాణదారులు, టీ స్టాల్స్, హోటళ్లకు వెళుతూ ప్రజలతో మాట్లాడారు. రాము వెంట ఆఖరికి మీడియాను గాని అధికారులను కానీ ఎవరిని రానివ్వకుండా ప్రత్యక్షంగా ప్రజల వద్దకు వెళ్లి వాళ్లతో ముచ్చటించారు.. ‘‘ నన్ను ఎన్నుకున్న మీకు నాకు మధ్య.. మధ్యవర్తులు ఉండరు’’ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడేందుకే వెళుతున్నా అంటూ మీడియాకు తెలియజేశారు. తాను అడిగిన ప్రశ్నలకు ప్రజలు సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తున్నారన్నారు. గుడివాడలో కొన్ని వర్గాల నుంచి టీడీపీకి చెందినవారు డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారంపై ప్రజలను నేరుగా ప్రశ్నించినట్లు తెలిపారు.అనేక ప్రాంతాల్లో తిరిగిన తనకు అలాంటిదేం లేదని ప్రజలు నేరుగా చెప్పారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.

Also Read : TG High Court : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ఇద్దరు ముద్దాయిలకు బెయిల్

Leave A Reply

Your Email Id will not be published!