#KalpanaChavla : భారతావని మరువలేని మహోన్నతి – కల్పనా చావ్లా
Kalpana Chawla is an unforgettable Indian
అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ – ఇండో-అమెరికన్ మహిళ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా, కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో మరణించి నేటికి సరిగ్గా 18 సంవత్సరాలు. 2003 ఫిబ్రవరి 1 న అంతరిక్షం నుంచి తిరిగివస్తూ కొలంబియా నౌక ప్రమాదానికి గురికావడంతో అమెతోపాటు మరో ఆరుగురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు.
భారతీయ వ్యోమగామిగా కల్పనా చావ్లా పేరు చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచి పోయింది. అంతరిక్షంలో ప్రవేశించడం,తిరుగు ప్రయాణంలో ప్రాణాలు కోల్పోవడం ఎవ్వరూ మర్చిపోలేని అతి భాదాకారమైన విషయం. అందుకే నాసా తన స్పేస్ క్రాఫ్ట్ కు ఆమె పేరు పెట్టింది.
కల్పనా చావ్లా భారతదేశంలోని హర్యానా రాష్ర్టంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించింది. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం. తండ్రి బనారసీలాల్ చావ్లా మాములు వ్యాపారి. పేదరికం నుంచే పైకెదిగిన తండ్రి పట్టుదల, కృషి కల్పనపై ప్రభావం పడింది. అనుకున్నది సాధించాలన్న తపన ఆయననుంచే అలవడింది. .తండ్రి దేశీయంగానే టైర్లు మార్చే యంత్రాన్ని రూపొందించి రాష్ట్రపతి తో సత్కారం కూడా అందుకోవటం .. జీవితంలో ఏదో సాధించాలన్న తపన . కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుపోయాయి. అందుకు నాన్నే కారణం.” అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమయిందీ కల్పన వివరించారు.
కల్పనా చావ్లా ముందుగా, కర్నాల్ లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. తోటి పిల్లలంతా కామిక్ పుస్తకాలు చదువుతూ , స్కూల్లో డ్రాయింగ్ క్లాసులో విమానం బొమ్మలు గీస్తుంటే, తన సోదరుడు సంజయ్ చావ్లా కూడా పైలట్ కావాలని కలలు కంటూ గదిలో విమానాల బొమ్మలని అలంకరించడం కల్పనలో స్ఫూర్తిని కలిగించాయి. . ఇద్దరి కలలూ ఒకటే – ఆకాశంలో ఎగరడం.ఈ క్రమంలోనే ఇంటర్ పాసయిన తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావాలన్న కోరికను తండ్రి నిరాకరించి వైద్య వృత్తిని స్వీకరించాలని సూచించిన వెనుదిరగక తండ్రిని ఒప్పించి, చండీగఢ్ లోని పంజాబ్ ఇంజరీరింగ్ కాలేజీలో బి.ఎస్.సి. (ఏరోనాటికల్ ఇంజనీరింగ్) పూర్తి చేశింది. 1982 లో డిగ్రీ చేతికిరాగానే అమెరికా వెళ్ళింది.
మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికా లోని టెక్సాస్ యూనివర్సిటీలో చేరింది. 1984 లో అది కూడా పూర్తయింది. కొలరాడో యూనివర్సిటీలో పిహెచ్డి చేసి, నాలుగేళ్ళ తరువాత డాక్టరేట్ పొందారు.. 1986 లో చావ్లా రెండవ మాస్టర్ అఫ్ సైన్సు డిగ్రీని , ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పిహెచ్ .డిని బౌల్డెర్ లో ఉన్న కోలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు. అందమైన భవిష్యత్ కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిళ కల్పనా చావ్లా. . ఈమె నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినపుడు ఈమెతో 2 వేల మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు.
ఆమె కాలిఫోర్నియాలో ఓ కంపెనీ ఉపాధ్యక్షురాలిగా పనిచేసారు. పరిశోధన శాస్త్రవేత్తగా అక్కడ అనుభవం గడించారు. ఏరో డైనమిక్స్ ఉపయోగానికి సంబంధించిన సమర్థమైన మెళకువలు నేర్చుకున్నారు. సిమ్యులేషన్, అనాలసిస్ ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర వైవిధ్యమున్న అంశాలను పరిశోధించారు. ఇదంతా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) కు దరఖాస్తు చేయకముందే పూర్తయింది.
ఆమె 1983 లో విమానయాన శిక్షకుడు , విమాన చోదక శాస్త్ర రచయిత ఐన జీన్-పియర్ హారిసన్ ను వివాహం చేసుకుంది.1990 లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశ పౌరురాలిగా అయ్యారు.. కొత్త కొత్త లోకాలకు వెళుతున్నట్లు భావిస్తూ ఊహల లోకాల్లో విహరించే ఈమెకు వ్యోమగామిగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగడానికి పునాదిగా ఈ ఊహలే ఉపకరించాయి.
1994 లో మొట్టమొదటి సారి కల్పనా చావ్లా పేరు ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే అప్పుడామెను “నాసా” వ్యోమగామిగా ఎంపిక చేసింది. నిజానికి కల్పనా చావ్లా “నాసా”కు దరఖాస్తు చేసేనాటికి ఆమెతో పాటు దాదాపు 2000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చెసుకున్నారు. అంతమందినీ పరిశీలించి, కేవలం 23 మందినే నాసా ఎంపిక చేసింది. 1995 లో మిగతా 22 మందితో కలసి నాసాకు చెందిన వ్యోమగామి శిక్షణ కార్యక్రమాన్ని ఈమె పూర్తి చేసుకున్నారు. టెక్సాస్ లోని హూస్టన్ లో గల జాన్సన్ స్పేస్ సెంటర్ లో తన శిక్షణ ను పూర్తి చేసి పైలట్ గా వివిధ రకాల విమానాలు నడిపేందుకు అర్హత సాధించారు.
1997 లో కల్పనా చావ్లా అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. అప్పుడామే, 376 గంటల పాటు భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు.
2003, జనవరి 16 న రెండోసారి అంతరిక్షం లోకి వెళ్ళే ముందు కల్పనా చావ్లా విలేకరులతో మాట్లాడారు. “భారతదేశంలో మొట్టమొదటి విమానాన్ని నడిపిన జె.ఆర్.డి.టాటా యే నాకు స్ఫూర్తి, అందుకనే ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ ను కెరీర్ గా తీసుకున్నా” అని చెప్పారు. భారత మహిళలకు మీరిచ్చే సందేశమేమిటని అడిగితే….. “ఏదో ఒకటి చేయండి, కానీ దాన్ని మీరు మనస్ఫుర్తిగా చేయాలనుకోవాలి. ఎందుకంటె ఏదైనా పనిని కేవలం ఒక లక్ష్యం కోసం చేయడం కాక,… దానిలో లీనమై అనుభవించాలి” అంది. అలా అనుభవించలేని వారు తమకు తాము వంచించుకున్నట్లేనని వివరించింది.
డాక్టర్ కల్పన 1988 లో నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్ లో చేరారు. విమాన యానానికి సంబంధించిన అనేకాంశాలపై పరిశోధనలు చేశారు. 1993 లో కాలిఫోర్నియా లోని లాస్ అల్టోన్ లో గల ఓవర్ సెట్ మెథడ్స్ ఇన్కార్పోరేటెడ్ లో ఉపాధ్యక్షురాలు (రీసెర్చి సైంటిస్ట్) గా చేరారు. అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షంలో శరీర కదలికలు, సమస్యలపై అనేక పరిశోధనలు చేశారు.ఏరో డైనమిక్స్ ఆప్టిమైసేషన్ కు సంబంధించిఅనేక టెక్నిక్స్ ను అభివృద్ధి పరిచారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు.
వ్యోమగామిగా ఎంపికైన తర్వాత శిక్షణలో భాగంగా ఆమె ఎంత కష్టమైన పనినైనా దీక్షతో చేశారు. శారీరక శ్రమ విషయంలో పురుషుల కంటే తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు.1988 లో నాసా లోని రీసెర్చి సెంటర్ లో సైంటిస్ట్ గా చేరిన కల్పన అయిదేళ్ళకే ఎన్నో పరిశోధనలు చేసి కాలిఫోర్నియా ఓవర్ సెట్ మెథడ్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనారు. 1995 లో నాసా వ్యోమగామి అభ్యర్థిగా ప్రకటించింది.
15 మంది వ్యోమగాములతో కలసి కల్పన అంతరిక్షంలోకి వెళ్ళేందుకు మూడేళ్ళపాటు శిక్షణ తీసుకున్నారు. 1997 లో ఎస్టిఎస్ – 87 లో అంతరిక్షం పైకి వెళ్ళారు. 1997 నవంబర్ 19 న మిషన్ స్పెషలిస్టుగా ఆరుగురు సభ్యులు గల చోదక సిబ్బందిలో ఒకరుగా 4 వ యు.ఎస్.మైక్రో గ్రావిటీ పేలోడ్ ప్లైట్ లో కొలంబియా “ఎస్టిఎస్ -87” మీద అంతరిక్షయానం చేసి సూర్యుని వెలుపలి వాతావరణాన్ని అధ్యయనం చేశారు.
వ్యొమనౌకను STS-87లో చావ్లా 1995 లో NASA వ్యోమగామి కార్పస్ లో చేరి .1996 లో మొదటి సారిగా అంతరిక్షయానం కోసం ఎన్నికైయ్యారు. 1997 నవంబర్ 19 న కొలంబియా వ్యొమనౌక (STS-87) లో ఆరు వ్యోమగాముల సభ్యులతో మొదలైంది. చావ్లా భారతదేశంలో పుట్టి అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి మహిళ , భారత దేశ సంతతిలో అంతరిక్షయానం చేసిన రెండో వ్యక్తి. మొదటిసారి ప్రయాణంలో, చావ్లా భూగ్రహం చుట్టూ 252 సార్లు మొత్తం 10.4 మిలియన్ మైళ్ళ దూరాన్ని 360 గంటలకన్నా ఎక్కువ సేపు ప్రయాణం చేసారు.
రెండవసారి అంతరిక్ష యానాన్ని చేసే అవకాశం కూడా ఆమెకు లభించింది. 2003 జనవరి 16, చివరగా చావ్లా కొలంబియా , STS-107 క్షిపణిలో చేరారు.చావ్లా ఈ ప్రయణములో ఉన్నా బాధ్యతలలో మైక్రో గ్రావిటీ ప్రయోగాలు,వీటి కోసం భూ-అంతరిక్ష విజ్ఞానం, నూతన సాంకేతిక అభివృద్ధి , వ్యోమగాముల ఆరోగ్యం ఇంకా వారి జాగ్రత్తల మీద సభ్యులతో కలిసి 80 ప్రయోగాలు చేసారు.
కొలంబియా అంతరిక్షనౌక తిరుగు ప్రయాణంలో 2003 ఫిబ్రవరి ఒకటవ తేదీన జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మొత్తం ఏడుగురు వ్యోమగాముల్లో కల్పనా చావ్లా ఒకరు కావడం విషాదకరం. కొలంబియా వ్యోమనౌక తిరుగు ప్రయాణంలో భూమికి 62 కి.మీ ఎత్తున ప్రయాణిస్తూ… మరో 16 నిముషాల కాలంలో కేప్ కెనవరాల్‌లోని కెనడీ అంతరీక్ష కేంద్రంలో దిగాల్సి ఉన్న తరుణంలో ప్రమాదానికి గురైంది. అత్యంత దురదృష్టకరమైన ఈ సంఘటనలో కొలంబియాలో ప్రయాణిస్తున్న కల్పనా చావ్లా (మిషన్ స్పెషలిస్టు) సహా మరో ఆరుగురు వ్యోమగాములు హజ్బెండ్ (కమాండర్), ఆండర్సన్ (పేలోడ్ కమాండర్), మెక్కూల్ (పైలట్), ఇలాన్ రామన్ (పేలోడ్ స్పెషలిస్టు), బ్రౌన్, క్లార్క్ (మిషన్ స్పెషలిస్టులు) ప్రాణాలు కోల్పోయారు.
దీనితో చంద్రుడితో పాటు సుదూరంలో ఉన్న అంగారకుడి వంటి గ్రహాలకు మానవులతో పాటు అంతరిక్ష నౌకలను పంపించాలనే పట్టుదలతో సాగుతున్న అంతరిక్ష యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది. గతంలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి పలు ప్రమాదాలు జరిగి నప్పటికీ అమెరికా చరిత్రలో చాలెంజర్, కొలంబియా’ దుర్ఘటనలు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్టేషన్‌కు మాయని మచ్చగా మిగిలి పోయాయి. అంతేగాకుండా అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళగా కీర్తిగడించిన కల్పనాచావ్లా అంతరిక్ష పరిశోధనలను కొనసాగించే ప్రయత్నంలో శాశ్వతంగా నింగికెగిసిన తారగా నిలిచి పోయింది.
కల్పనా చావ్లా చేసిన సేవకు ఎన్నో అవార్డులు, రివార్డులు మరణానంతరం పొందారు.NASA స్పేస్ ఫ్లైట్ మెడల్,NASA విశిష్ట సేవా మెడల్,డిఫెన్స్ విశిష్ట సేవా మెడల్ అవార్డులుగా లభించాయి.
కల్పనా జ్ఞాపకార్ధం గా2004 వ సంవత్సరం లో ‘కల్పనా చావ్లా అవార్డు’ ను నెలకొల్పి యువ మహిళా శాస్త్త్రవేత్తల కోసం కర్ణాటక ప్రభుత్వము ప్రారంభించింది.
చావ్లా మరణం తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ లోని ఆడపిల్లల హాస్టల్ కు కల్పనా చావ్లా అని పేరు పెట్టారు.ఆమె గౌరవార్ధం తమిళనాడు ప్రభుత్వం కల్పనా చావ్లా పురస్కారాన్ని 2003 నుంచి సంవత్సరం ప్రకటిస్తోంది.ఇలా విశ్వవ్యాప్తంగా ఎందరో మహిళలకే గాక పురుషులకు కూడా ఆదర్శమైన మహిళ, తన పరిశోధన మరియు విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం.
No comment allowed please