Kumbh Mela 2025 Stampede : ‘మహా కుంభమేళా’ తొక్కిసలాటపై స్పందించిన ప్రధాని
దీంతో అరుస్తూ, కేకలు వేస్తూ తమ కుటుంబ సభ్యుల కోసం ఆర్తనాదాలు చేశారు...
Kumbh Mela : ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో ఈరోజు మౌని అమావాస్య స్నానానికి హాజరైన భక్తుల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది. సంగం నది దగ్గర జరిగిన ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఇది మంగళవారం నుంచి బుధవారం మధ్య రాత్రి 1:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ సమయంలో రెండో రాజ స్నానం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో సంగం నది వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
PM Modi-Kumbh Mela Stampede…
ఆక్రమంలో పురుషులు, స్త్రీలు సహా అందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో అరుస్తూ, కేకలు వేస్తూ తమ కుటుంబ సభ్యుల కోసం ఆర్తనాదాలు చేశారు.సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది అక్కడి నుంచి గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకున్నారు. ప్రధాని మోదీ(PM Modi) తక్షణమే బాధితులకు సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
కుంభమేళా అథారిటీ ప్రత్యేక కార్యనిర్వాహక అధికారి ఆకాంక్ష రాణా ఈ ఘటన గురించి వివరణ ఇచ్చారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, సంగం నోస్ వద్ద అడ్డంకి విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఆ క్రమంలో భక్తులు ఒకరికొకరు పడిపోయారని చెప్పారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారని, వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇది తీవ్రమైన పరిస్థితి కాదని ఆమె అన్నారు. భయాందోళన చెందాల్సిన పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
Also Read : CM Chandrababu-SC : సీఎం చంద్రబాబు కేసులపై సుప్రీం గరం