Mahakumbh Mela 2025 : ప్రయాగరాజ్ కుంభమేళా సెక్టార్ 22లో భారీ అగ్ని ప్రమాదం
ఇందులో 30 మంది మరణించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది...
Mahakumbh Mela : ప్రయాగ్‌రాజ్ నుంచి బ్రేకింగ్ న్యూస్. మహాకుంభమేళా(Mahakumbh Mela) ప్రాంతంలోని సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. అనేక టెంట్‌లు దగ్ధమవుతున్నాయి. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేసేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి. మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణమేమిటి? అన్నది ఇంకా క్లియర్‌గా తెలియలేదు. జనవరి 19వ తేదీ కూడా గ్యాస్ సిలిండర్స్ పేలి కుంభమేళాలో అగ్ని ప్రమాదం జరిగింది.
Mahakumbh Mela 2025 Fire Incident…
మౌని అమావాస్య సందర్భంగా బుధవారం తెల్లవారుజూమున తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 30 మంది మరణించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కుంభమేళాలో తొక్కిసలాటపై ప్రస్తుతం విచారణ జరుగుతుండగా.. యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్య ఘాట్‌ల దగ్గర రద్దీ తగ్గించేందుకు ఐదు కీలక మార్పులు చేశారు సీఎం యోగి. కుంభమేళా జరుగుతున్న ప్రాంతాన్ని ఫిబ్రవరి 4 వరకు ‘నో వెహికల్’ జోన్‌గా ప్రకటించారు.
భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు రోడ్లను వన్ వేగా మార్చారు. వీవీఐపీ పాస్‌లను రద్దు చేశారు. స్పెషల్ పాస్‌లు ఉన్నప్పటికీ అనుమతించడంలేదు.. ప్రయాగ్‌రాజ్ చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను సరిహద్దుల్లోనే నిలిపివేశారు. రోడ్డుపై విక్రయించుకునే చిరు వ్యాపారులను ఖాళీ ప్రదేశాల్లోకి తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని సీఎం యోగి ఆదేశించారు.కుంభమేళాకు వచ్చే వారిని అడ్డుకోవద్దని కోరారు. పోలీసులు పెట్రోలింగ్‌ను పెంచాలని, కుంభమేళా నుంచి భక్తులు తిరిగి వెళ్లే మార్గాలలో అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు.కుంభమేళాకు వచ్చిన భక్తులు వారణాసి, అయోధ్య, చిత్రకూట్, మీర్జాపూర్‌లను కూడా సందర్శిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోనూ నిఘా పెంచాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read : Gudivada MLA : ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ప్రజల వద్దకు ఎమ్మెల్యే