Maharashtra Election : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ కు నేడే చివరి రోజు
మహా వికాస్ అఘాడీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 103 మంది అభ్యర్థులను ప్రకటించింది...
Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార, విపక్ష కూటములు నువ్వా-నేనా అన్నట్టుగా క్షేత్రస్థాయిలో పోటీపడుతున్నాయి. అయితే సీట్ల పంపకం విషయంలో మాత్రం ఎడతెగని ఉత్కంఠ కొనసాగిస్తున్నాయి. అధికార కూటమి, విపక్షాల ఫ్రంట్‌లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది. నేడు (మంగళవారం) నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. అయినప్పటికీ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీలతో కూడిన కూటమి మరో తొమ్మిది స్థానాల్లో పోటీపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. సీట్ల పంపకం విషయంలో విపక్ష కూటమిలోనూ ఇంతకుమించిన అస్పష్టత నెలకొంది. ఇప్పటికే పార్టీల మధ్య గొడవలు కూడా జరిగాయి. సీట్ల షేరింగ్ విషయంలో మూడు పార్టీలు ఇప్పటికే లెక్క తప్పాయి. అయినప్పటికీ మరో16 స్థానాలపై ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో కూటమిలోని చిన్న పార్టీ సీట్ల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్నాయి.
Maharashtra Assembly Elections Update
అధికార కూటమిలో బీజేపీ(BJP) మొత్తం 150 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పినప్పటికీ చివరకు 146 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. నాలుగు సీట్లను యువ స్వాభిమాన్ పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే), జన్ సురాజ్య శక్తి చిన్న మిత్రపక్షాలకు కేటాయించింది. అయితే అందులోని ఇద్దరు సభ్యుల పేర్లు ఏకనాథ్ షిండే శివసేన జాబితాలో కనిపించాయి. దీంతో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్) కేటాయించిన సీట్లు సంఖ్య 138కి పెరిగినట్టు అయింది. కాగా బీజేపీ మాదిరిగానే షిండే శివసేన కూడా రెండు సీట్లను చిన్న పార్టీలకు కేటాయించింది. మిగిలిన 58 స్థానాల్లో 49 మంది అభ్యర్థులను అజిత్ పవార్ ప్రకటించారు. దీంతో అధికార కూటమి కూడా మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
మహా వికాస్ అఘాడీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ(Congress) ఇప్పటివరకు 103 మంది అభ్యర్థులను ప్రకటించింది. శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం 87 మంది, శరద్ పవార్ ఎస్‌సీపీ 82 సీట్లలో అభ్యర్థులను మోహరించింది. దీంతో 288 సీట్లలో మొత్తం 272 స్థానాల్లో క్లారిటీ వచ్చింది. మిగతా సీట్లపై ఇప్పటివరకు స్పష్టత రాకపోవడం గమనార్హం. దీంతో మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం, అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆలస్యం, అనిశ్చితి కొనసాగుతున్నట్టుగా స్పష్టమవుతోంది. తిరుగుబాట్లు కారణంగా చీలక రావడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గడిచిన రెండేళ్లలో మహారాష్ట్ర పలు కీలక రాజకీయ సంక్షోభాలను చవిచూసింది. శివసేనలో చీలిక, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ పతనం, బీజేపీ-శివసేన షిండే వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, శరద్ పవార్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక, ఆయన పాలక కూటమిలో చేరిక ఇలా చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగాయి.
Also Read : Minister Nara Lokesh : మైక్రోసాఫ్ట్ సీఈవో తో భేటీ అయిన ఏపీ ఐటీ మినిస్టర్