సుకుమార్, వంశీలకు హ్యాండిచ్చినట్టే.. త్రివిక్రమ్ కి ఇస్తాడా?

మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా? అలా జరగదు కదా..

సూపర్ స్టార్ మహేష్ బాబు..తీసుకునే నిర్ణయాలు..చాలా ప్లాన్డ్ గా పక్కాగా ఉంటాయని అందరూ అనుకునేమాట..ఈమధ్య ఆ నిర్ణయాల్లో తేడాపాడాలు రావడంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. అవతలివారిని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి ఇలాంటి ఆశాభంగమే ఎదురైంది..‘ఎస్..నేనొక్కడినే’ తర్వాత వాళ్లిద్దరితో మరొక సినిమా వస్తుందని మహేష్ ప్రకటించి..సుకుమార్ కి కొండంత అండగా నిలిచాడు.

తర్వాత రంగస్థలం సినిమా సూపర్ హిట్ అయ్యాక.. సుకుమార్ చెప్పిన కథ మహేష్ కు నచ్చడం..ఓకే చెప్పేయడం, పేపరు స్టేట్మెంట్లు అన్నీ వచ్చేసాయి. ఆ కథ మీద సుకుమార్ 6నెలలు పనిచేసి..మొత్తం స్క్రిప్ట్ అంతా ఓకే అయ్యాక.. మహేష్ నో చెప్పి..‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాకి ఓకే చెప్పడం వివాదస్పదమైంది. దాంతో హర్ట్ అయిన సుకుమార్ ని ఊరడించడానికి..మళ్లీ మహేష్ ముందుకు వచ్చి..అది స్టోరీ విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాలే తప్ప..సుకుమార్ కి, నాకు మధ్య ఎలాంటి ప్రాబ్లం లేదు..తన మేకింగ్ స్టయిల్ నాకిష్టం..అని సమస్యను ము గించారు.

ఈలోపు సుకుమార్..అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో పడిపోయారు. ఇదే సీన్ మళ్లీ వంశీ పైడిపల్లితో రిపీట్ అయ్యింది. మహర్షి సినిమా తర్వాత.. మరో సినిమా తనతోనే చేస్తానని మాటిచ్చి..ఇప్పుడు పరశురాంతో సర్కారువారి పాట తో ముందుకెళ్లడంతో..మహేష్ మాట మీద నిలబడడు అనే బ్యాడ్ నేమ్ మూటగట్టుకుంటున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..త్రివిక్రమ్ తో సినిమా కూడా అలాగే ఉంటుందా?అని అందరూ అనుకునేమాట..అందుకే త్రివిక్రమ్ కూడా ఈ విషయంలో నోరు మెదపడం లేదు..జరిగినప్పుడు చూద్దాం లే అన్నట్టే ఉన్నారు.

 

Leave A Reply

Your Email Id will not be published!