Medaram Jatara : అంగరంగ వైభవంగా మేడారం సమ్మక్క ఆగమన పూజలు

ఇదిలా ఉండగా... సారలమ్మను ఇప్పటికే గిరిజన పూజారులు కొమ్ములు, డప్పు వాయిద్యాలతో తీసుకొచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠించారు

Medaram Jatara : మేడారం జాతర 2024లో కీలక ఘట్టం నెలకొంది. విశ్వాసులు ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మేడారంలో తొలి పూజలు ప్రారంభమయ్యాయి. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చి గద్దెపై కూర్చోబెట్టారు. కుంకుమ రూపంలో ఉన్న సమ్మక్కను కోయ సన్యాసులు గద్దెపై ప్రతిష్టించారు.

Medaram Jatara Updates

ఇదిలా ఉండగా… సారలమ్మను ఇప్పటికే గిరిజన పూజారులు కొమ్ములు, డప్పు వాయిద్యాలతో తీసుకొచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠించారు. పగిడద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెపై కొలువుతీరారు. సమ్మక్క రాకతో ఎట్టకేలకు జాతరలో ముఖ్యమైన ఘట్టం పూర్తయింది. ఒక్కసారి సమ్మక్క గద్దెపై అధిష్టిస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. నాలుగు రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు(Medaram Jatara) దేశం నలుమూలల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడంతో మేడారం జన సంద్రమైంది. భక్తులు జంపన్నవాగులో పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకుంటారు. మేడారం ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతలా భక్తులతో నిండిపోయింది. మేడారం పరిసర ప్రాంతాలు గుడిసెలతో నిండి ఉన్నాయి.

Also Read : AP DSC 2024: డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు… తప్పుల సవరణకు కూడా ఛాన్స్‌ !

Leave A Reply

Your Email Id will not be published!