Minister Lokesh : పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి కలకలం.. భగ్గుమన్న మంత్రి

క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని తెలిపారు...

Minister Lokesh : పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో గంజాయి కలకలంపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు గంజాయి బారిన పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదుపై లోకేష్ తక్షణమే స్పందించారు. సమగ్ర విచారణ జరిపి, గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. విద్యాలయాల ప్రాంగణంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు లోకేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఇప్పటికే తమ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని లోకేష్ తెలిపారు. పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ మంత్రి నారా లోకేష్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు.

Minister Lokesh Comment

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి తమ పిల్లల్ని పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చేర్పించి తీవ్రంగా నష్టపోతున్నామంటూ ప్రజా దర్బార్‌లో నారా లోకేష్‌(Minister Lokesh)ని కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. క్యాంపస్ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని తెలిపారు. క్యాంపస్ లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు మార్కుల పరంగా ఫెయిల్ అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతిలో 90 శాతం పైగా మార్కులు సాధించిన తమ పిల్లలకు ఇంటర్‌లో సిబ్బంది ఇంటర్నల్ మార్క్స్ విషయంలో నిర్లక్ష్యం వహించి ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. లోపభూయిష్టంగా తయారైన పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ పై దృష్టి సారించి తమ విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని కోరారు. సమస్యను తప్పక పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడతానని లోకేష్ హామీ ఇచ్చారు.

Also Read : Supreme Court : ముస్లిం మహిళల భరణం పై ఉరటనిచ్చిన సుప్రీంకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!