Minister Pemmasani : జగన్ సర్కార్ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసింది

నగరవాసులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఉందన్నారు..

Minister Pemmasani : వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని మంత్రి పెన్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించామన్నారు. తాగునీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ వంటి పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు. నిధుల కొరతతో తాగునీరు, డ్రైనేజీ పనులు నిలిచిపోయాయని అన్నారు.

Minister Pemmasani Comment

నగరవాసులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఉందన్నారు. గుంటూరు నగరంలో తాగునీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామని చెప్పారు. అధికారుల సహకారంతో బాకీ ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పెన్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి వారం కాకపోయినా ప్రతి పదిహేను రోజులకోసారి అభివృద్ధి పనులపై సమీక్ష జరుగుతుందన్నారు.

Also Read : Minister Anitha : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి

Leave A Reply

Your Email Id will not be published!