MLA Harish Rao : రేవంత్ సర్కార్ రైతులను రోడ్డుకు ఈడ్చింది
వడ్ల కొనుగోలు కోసం కేంద్రాలను త్వరగా ప్రారంభించాలని ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు...
Harish Rao : తెలంగాణ రైతును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్డును పడేశారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హరీశ్‌రావు(Harish Rao) మాట్లాడుతూ.. తడిసిన వడ్లను ఈ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. అయితే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తడిసిన వడ్లు కొనుగోలు చేయ్యాలంటూ తీవ్ర ఒత్తిడి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్ రావు(Harish Rao) గుర్తు చేశారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అలా.. అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. రైతు బంధు, వడ్లకు బోనస్ ఎందుకు ఇవ్వడం లేదని రేవంత్ సర్కార్‌ను ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. కల్లాల వద్ద వడ్ల కొనుగోళ్ల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
MLA Harish Rao Slams..
వడ్ల కొనుగోలు కోసం కేంద్రాలను త్వరగా ప్రారంభించాలని ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో ఈ రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతుల పరిస్థితి గాల్లో దీపంలాగా మారిందన్నారు. రైతులకు వడ్ల కోసం మంచి బస్తాలు సైతం ఈ ప్రభుత్వం అందించడం లేదంటే.. ఈ ప్రభుత్వ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందని తెలిపారు. రేవంత్ ప్రభుత్వానికి రైతుల మద్దతు కావాలి.. కానీ వారు పండించే వడ్లకు మాత్రం కనీస మద్దతు ధర ఎందుకు ఇవ్వరని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావు సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల ముందు.. క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తానని ఇదే రైతులకు ఇదే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ హామీ నేటికి అమలు కావడం లేదని చెప్పారు. అయితే ప్రభుత్వం రైతులకు ఇస్తున్న బస్తాలు నాణ్యత లేకపోవడంతో.. క్వింటాకు రూ. 1000 మేర రైతు నష్ట పోతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
అలాగే రైతులకు కనీన గిట్టుబాట ధర కూడా రావడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతన్నారని ఈ సందర్బంగా హరీశ్ రావు పేర్కొన్నారు. వడ్ల రైతుల పరిస్థితులపై వెంటనే సమీక్ష నిర్వహించి.. చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నేటికి ఎన్ని క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేశారో… అలాగే నేటి వరకు రైతుల నుంచి మీరు ఎన్ని క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేశారో చెప్పాలని ఈ సందర్భంగా రేవంత్ సర్కార్‌ను హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Also Read : AP Home Minister : ఆ నేతలు హత్యలను రాజకీయాలకు వాడుకుంటున్నారు