MP Nandigam Suresh : ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా 2024లో జగన్ విజయం కాయం

ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు , లోకేష్, పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగిన ఎంపీ నందిగం సురేష్

MP Nandigam Suresh : వై నాట్ 175 లక్ష్యంగా వైసీపీ పక్కా ప్లాన్ ని అమలు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో నియోజక వర్గాల ఇంఛార్జిల మార్పులు ఒకవైపు జరుగుతుండగానే, మరో వైపు సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సామజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు.

MP Nandigam Suresh Slams Chandrababu

ఎంపీ నందిగం సురేష్, ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు సినీ నటుడు అలీతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గున్నారు. ఆ బస్సు యాత్రలో నందిగం సురేష్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు, చంద్రబాబు ప్రవేశపెట్టిన ఒకేఒక్క పథకం వెన్నుపోటు అన్నారు ఎంపీ.ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులూ, హాఫ్ నాలెడ్జి ఉన్న లోకేష్ లాంటి వ్యక్తులూ, మరియు వయసు అయిపోయన చంద్రబాబు లాంటి వ్యక్తులు వంద మంది వెయ్యి మంది కలిసి వచ్చిన 2024లో జగన్ మోహన్ రెడ్డిగారి గెలుపుని ఎవ్వడు ఆపలేడు అంటూ వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడం కాయం అన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసారు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాలు అయినా ఎమ్మెల్యే కూడా కాలేకపోయారని విమర్శించారు ఎంపీ నందిగం సురేష్(MP Nandigam Suresh). చంద్రబాబు ఓటుకు 2000 రూపాయలు ఇవ్వాలని చూస్తున్నారని ఆడబ్బు ఒక్కరోజుకి కూడా సరిపోదన్నారు. అదే జగన్ ముఖ్యమంత్రి అయితే జీవితం మొత్తం సంతోషంగా ఉండొచ్చు అన్నారు. పవన్ కళ్యాణ్ కి కావలసింది ప్యాకేజీ, చంద్రబాబుకి కావలసింది అడ్డదిడ్డంగా ముఖ్యమంతి పీఠం ఎక్కడం, ఈ రాష్ట్రానికి శని పట్టినట్టు పట్టిన ఈ ముగ్గురుని 2024లో గంగలో కలిపే బాధ్యత ప్రజలందరూ తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు ని మరోసారి ఎలా అయినా గెలిపించాలని కోరారు సినీ నటుడు అలీ.  రాబోయే కాలంలో శ్రీనివాసులుని మంత్రిగా చూస్తాము అన్నారు.

Also Read : YS Sharmila Invites : కుమారుడి నిశ్చతార్దానికి తన అన్నని ఆహ్వానించిన షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!