#Paswan : ప్రపంచంలోనే అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన.. పాశ్వాన్
74 ఏళ్ల రాంవిలాస్ పాశ్వాన్ గుండెపోటుతో మృతి
paswan : 1946 జులై 5న బీహార్ లో జన్మించిన పాశ్వాన్ 1969లో అంటే 23 ఏళ్ల వయసులో సంయుక్త సోషలిస్టు పార్టీ తరఫున పోటీచేసి బీహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలా ప్రస్థానం ప్రారంభించి 1977లో లోక్ సభ ఎన్నికల్లో హాజీపూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి.. నాటి కాలంలో ప్రపంచంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. అలా 8 సార్లు లోక్ సభ ఎంపీగా అక్కడ నుంచే విజయం సాధించిన ఆయన, మరో రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఇలా సుమారు 50ఏళ్లు రాజకీయ ప్రస్థానం సాగించిన గొప్ప నేతగా పేరుపొందారు..ప్రస్తుతం సమకాలీన రాజకీయాల్లో ఆయన సాటి ఎవరూ లేరనే చెప్పాలి.
ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన పాశ్వాన్ కు గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆపరేషన్ అనంతరం బాగానే ఉన్నా ..హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం..ప్రజలందరినీ విషాదంలో ముంచెత్తింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో కేంద్రమంత్రి పదవులను నిర్వహించారు. ఆయన పార్టీ మారారంటే చాలు..వాళ్లు అధికారంలోకి వస్తారనే ప్రచారం ఉంది. ఆయన రాజకీయ పరిజ్నానం అంత పెర్ ఫెక్ట్ గా ఉండేది. అలాగే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లతో సఖ్యతతో ఉండి..మంత్రి పదవులు నిర్వహించారు.
ఒక మంచి సహచరుడిని కోల్పోయాని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇంకా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాహుల్ గాంధీ ప్రముఖులు అందరూ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు భార్యలు, మొదటి భార్యకు విడాకులిచ్చి..రీనాశర్మను పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు, రెండో భార్యకు కొడుకు, కూతురు ఉన్నారు. బీహార్ లోని సమస్తీపుర్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన పాశ్వాన్ చిన్న సోదరుడు 2019లోనే మరణించడం, ఇప్పుడు రాంవిలాస్ పాశ్వాన్ మరణించడం యాదృచ్చికంగానే జరిగినా..ఇద్దరూ లోక్ సభ్ కు ప్రాతినిధ్యం వహిస్తూనే కాలం చేశారు.