#PosterMovie : ఫిబ్రవరిలో ధియేటర్లలో పోస్టర్
Postar Movie ready to release in February
Poster Movie : శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి మహిపాల్ రెడ్డి (టిఎంఆర్) దర్శకుడిగా విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “పోస్టర్”. ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికేట్ తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి నెలలో విడుదలకు ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ …“ ప్రతి ఇంట్లో జరిగే కథనే సినిమాగా తీశాను. ఈ కుటుంబ కథా చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మిగతా పాటలు విడుదల చేసి ఫిబ్రవరి నెలలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాడానికి సన్నాహాలు చేస్తున్నాం. హీరో విజయ్ ధరన్ ఫర్ఫార్మెన్స్ , హీరోయిన్స్ రాశి సింగ్, అక్షత సోనావానే అందం, అభినయం మా సినిమాకు ఎస్సెట్ అని చెప్పొచ్చు. థియేటర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన మా సినిమా థియేటర్ లోనే చూస్తేనే థ్రిల్ ఉంటుందని ఇన్ని రోజులు వెయిట్ చేసి ప్రజంట్ థియేటర్స్ పూర్తి స్థాయిలో ఓపెన్ కావడంతో మా సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు.
No comment allowed please