Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మత్తు పనులు షురూ చేసిన అధికారులు

64వ నంబరు గేటు వద్ద ఉండే వెయిట్‌ స్వల్పంగా దెబ్బతినగా...

Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. నిపుణుల పర్యవేక్షణలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ 67, 69 నెంబర్‌ గేట్లకు మరమ్మతు పనులు సాగుతున్నాయి. బ్యారేజ్‌(Prakasam Barrage) 69వ గేటు వద్ద పడవ ఢీకొని కౌంటర్‌ వెయిట్‌ దెబ్బతిన్న విషయం తెలిసిందే. నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. చీఫ్‌ ఇంజినీర్‌ తోట రత్నకుమార్‌ ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, డ్యామ్‌ సేఫ్టీ చీఫ్‌ ఇంజినీర్‌గా రత్నకుమార్‌ ఉన్నారు. అలాగే ఇరిగేషన్‌ శాఖ అడ్వైజర్‌ కె.వి.కృష్ణారావు కూడా మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ సీతానగరం పీడబ్ల్యూ వర్క్‌షాప్‌ రిటైర్డ్‌ ఇంజినీర్‌ కె.వి.కృష్ణారావు పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ ఈఈ ఇంజినీర్‌ విజయసారథి మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు.

Prakasam Barrage Gates Repair

కాగా.. రెండు రోజు క్రితం కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఇనుప బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజీ(Prakasam Barage) గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్‌ వెయింట్లు దెబ్బతిన్నాయి. 64వ నంబరు గేటు వద్ద ఉండే వెయిట్‌ స్వల్పంగా దెబ్బతినగా.. 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్‌ సిమెంట్‌ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. ఈనెల 2న కృష్ణా నదికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తిన విషయం తెలసిందే. ఎగువన భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీపట్నం ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లి బోట్లకు లంగరేశారు. వరద ఉధృతికి వీటిలో 4 బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో ఒక బోటు 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీ కొని మరో రెండు బోట్లు ఆగిపోయాయి. మరో బోటు 64వ నంబరు ఖానా వద్ద ఉన్న కౌంటర్‌ వెయిట్‌ను ఢీ కొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ బోటూ ఇక్కడ ఇరుక్కుపోయింది.

Also Read : CM Nara Chandrababu Naidu: నేటి నుంచి వరద బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ !

Leave A Reply

Your Email Id will not be published!