#PuriMusings: కాకిలా కలకాలం ఆనందంగా బతకండి
ఈసారి ‘త్యాగం’ విలువ చెప్పి..కనులు తెరిపించిన ‘పూరీ మ్యూజింగ్స్’
Puri Musings : పూరీ మ్యూజింగ్స్ అంటూ.. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో అందరూ ఖాళీగా ఉన్నారు..సినిమాల్లేవు..చూసిన సినిమాలే మళ్లీ మళ్లీ చూడటం..అలాగే తనకీ సినిమా చేసేందుకు అవకాశం లేదనుకుంటూ..ఒక కాన్సెప్ట్ పట్టుకొని తనదైన స్టయిల్ లో చెబుతున్నారు. రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూలు ఇస్తూ..ఆయన ఇమేజ్ ని పెంచుకోవడమో, తగ్గించుకోవడమో చేస్తున్నారు..కానీ పూరీ కేవలం మ్యూజింగ్స్ తో తన అభిప్రాయాలు కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.
అందులో ప్రస్తుతం మనిషి జీవితం త్యాగాలమయమైపోతోంది..ఎవరి కోసం త్యాగం చేయాలి..ఎందుకు త్యాగం చేయాలి..ముందు తల్లిదండ్రులు, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, తర్వాత చదువులు, తర్వాత పెళ్లిళ్లు, మళ్లీ తర్వాత మనవల పెళ్లిల్లు..ఇలా జీవితమంతా బరువులు మోస్తూ..వీడి వందేళ్ల జీవితాన్ని సంక నాకించేస్తున్నాడు. ఒక కాకిని చూడండి..ఒక నాలుగు గుడ్లు పెడుతుంది.. వాటిని పొదుగుతుంది..వాటికి రెక్కలొచ్చేవరకు చూస్తుంది..తర్వాత వాటంతటవే ఎగిరిపోతాయి..
కానీ మనిషి మాత్రం పిల్లల్ని చదివించి..వారికి పెళ్లిళ్లు చేసి..ఉద్యోగం వచ్చేవరకు కనిపెట్టుకొని కాపలా కాస్తుతున్నాడు..వాడిని వదిలేయండి..లేదంటే ఇంట్లోంచి గెంటేయండి..తప్పులేదు..కొన్ని రోజుల తర్వాత వాడు వచ్చి..ఇదిగో ఈ అమ్మాయిని ప్రేమించాను..తననే పెళ్లి చేసుకుంటాను అంటే..ఆహ్వానించండి..
ఇంకా చెబుతూ మనిషి జీవితాలన్నీ త్యాగాలపైనే నడుస్తున్నాయి.. మహాసామ్రాజ్యాన్ని త్యాగం చేసిన బుద్ధుడు, అన్నింటినీ వదులుకున్న మదర్ థెరిస్సా, చర్చి, మసీదు, హిందూ దేవాలయాలు..దేశం, ఇలా అన్ని వ్యవస్థలు మనుషుల త్యాగాలను, వారి జీవితాలనే కోరుకుంటాయి.. వీటితో పాటు కుటుంబం కోసం త్యాగాలు.. ఒక మనిషి నెత్తి మీద ఇన్ని త్యాగాలుంటే వాడెలా మోయగలడు? అని తన స్టయిల్ లో ప్రశ్నించారు.తొక్కలో ది మతం, కులం, సంఘం, డబ్బులు ఇలా వీటన్నింటినీ మోసుకుంటూ మీది ఎలాగూ పోయింది..వాడి జీవితాన్ని కూడా సంకనాకించకండి.. అంటూ చెప్పడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.