Rahul Gandhi : వాణిజ్య లోటు గరిష్ట స్థాయికి చేరడం పై భగ్గుమన్న రాహుల్ గాంధీ
దేశంలో రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు, దిగుమతులు నమోదవడంపై సోషల్‌మీడియా వేదికగా స్పందించారు...
Rahul Gandhi : వాణిజ్య లోటు ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై బుధవారం లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రభుత్వం చట్టపరంగా జరిగే వ్యాపారాల పట్ల పారదర్శకంగా వ్యవహరించట్లేదని మండిపడ్డారు. ‘ప్లే-ఫెయిర్’కంటే క్రోనీ వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేశ ఆర్థికవ్యవస్థకు నష్టం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తయారీ రంగం బలహీనపడుతోందని, ఇదివరకెన్నడూ లేనివిధంగా కరెన్సీ విలువ క్షీణిస్తోందని అన్నారు. పదేళ్లుగా మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగానే దేశంలో రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు నమోదయ్యిందని ఆందోళన వెలిబుచ్చారు.
Rahul Gandhi Comments
వాణిజ్యలోటు, దిగుమతులు గతంలో ఎన్నడూ లేనంతగా నమోదయ్యాయని ఒక మీడియా కథనాన్ని ఎక్స్‌లో ట్యాగ్ చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Rahul Gandhi). దేశంలో రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు, దిగుమతులు నమోదవడంపై సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. మోదీ ప్రభుత్వం దేశం కోసం కాక సన్నిహిత వ్యాపారులకు మేలు చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే వాణిజ్య లోటు ఆల్‌టైం హైకి చేరిందని విమర్శలు గుప్పించారు రాహుల్‌గాంధీ. దీని గురించి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మోదీ ప్రభుత్వం ‘ప్లే-ఫెయిర్’వ్యాపారాలను ప్రోత్సహించడానికి బదులుగా క్రోనీ బిజినెస్‌లను ప్రోత్సహిస్తే ఇలా కాక ఇంకెలా జరుగుతుందని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ. ఇదే తరహా విధానాలు కొనసాగిస్తే తయారీ రంగం పూర్తిగా దెబ్బతిని కరెన్సీ విలువ బలహీనపడుతుందని మండిపడ్డారు. రికార్డు వాణిజ్య లోటు కారణంగా వడ్డీరేట్లు తారాస్థాయికి చేరుతాయని, వస్తువుల వినియోగం తగ్గి ద్రవ్యోల్బణం పెరగడం చూస్తామని సోషల్‌మీడియా వేదికగా పేర్కొన్నారు.
అక్టోబర్‌లో రెండంకెల వృద్ధిని నమోదు చేసిన ఎగుమతుల రంగం నవంబర్ నెలలోకి అడుగుపెట్టేసరికి చతికిలపడింది. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన నవంబర్ నెలలో ఎగుమతుల 4.85 శాతానికి అంటే 3,211 కోట్ల డాలర్లకు (రూ.2,72,646 కోట్లు) పడిపోయాయి. ఇదే సమయంలో దిగుమతులు 27శాతం పెరిగాయి. రికార్డు స్థాయిలో 69.95 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 37.84 బిలియన్ డాలర్లకు చేరింది. అంతేకాక బంగారం దిగుమతులు జీవనకాల గరిష్ఠస్థాయిని అందుకున్నాయి. పసిడి దిగుమతులు గణనీయంగా పెరగడం వల్లే.. వాణిజ్య లోటు ఆల్‌టైం గరిష్ఠ స్థాయిని తాకిందని వాణిజ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : Ravichandran Ashwin : తనపై పెద్ద కుట్ర జరిగిందంటూ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ బౌలర్