Rains in Hyd : హైదరాబాద్ లో కుండపోత వర్షానికి చాలా ప్రాంతాలు జలమయం
భారీ వర్షాలకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి...
Rains in Hyd : భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈరోజు (గురువారం) మధ్యాహ్నం మేఘావృతమై భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. వర్షం కురవగానే ప్రజల ఉపశమనం కలిగింది. మలక్ పేట, చాదర్ ఘాట్, మాదన్నపేట్, సైదాబాద్, సంతోష్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, మీర్ పేటలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
Rains in Hyd Viral
భారీ వర్షాలకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read : CM Chandrababu Naidu : విద్యా కానుక కిట్లపై చంద్రబాబు కీలక ఉత్తర్వులు