#Rajanala : హాలీవుడ్ లో నటించిన తొలి తెలుగు నటుడు రాజనాల  

Rajanala is the first Telugu actor to act in Hollywood

Rajanala : దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా 400 పై చిలుకు చిత్రాల్లో వివిధ రకాలైన పాత్రలు పోషించారు . తెలుగు సినిమా, నాటకాల్లో ఎక్కువగా నటించారు . కొన్ని తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు . పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో కంసుడు, జరాసంధుడు, మాయల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు లాంటి ప్రతినాయక పాత్రలలో రాణించాడు.
నెల్లూరు జిల్లా కావలి కి చెందిన రాజనాల అసలు పేరు రాజనాల కల్లయ్య (రాజనాల కాళేశ్వరరావు). ఈయన 1925, జనవరి 3న జన్మించారు . ఇంటర్‌ చదువుతూనే 1948లో నెల్లూరులో స్నేహితుడు లక్ష్మీకుమార్‌ రెడ్డితో కలిసి నేషనల్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ అనే నాటక సంస్థను ప్రారంభించారు . మొదటగా నెల్లూరు టౌన్‌హాలులో ఆచార్య ఆత్రేయ ‘ఎవరు దొంగ’ నాటకాన్ని ప్రదర్శించారు. నాటకం చూసిన జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ శాఖలోని అవినీతిని బట్టబయలు చేశావంటూ రాజనాలపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఆ తరువాత ‘ప్రగతి’ అనే నాటకాన్ని ప్రదర్శించగా కోపగించిన కలెక్టర్‌ రాజనాలను సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత ఉద్యోగం వచ్చినా ఇష్టంగా చేసేవారు కాదు.
1951లో రాజనాలకు మిత్రుడు లక్ష్మీకుమార్‌రెడ్డి నుంచి మద్రాసుకు పిలుపు వచ్చింది. అప్పటికే లక్ష్మీకుమార్‌రెడ్డి నిర్మాత హెచ్. ఎం. రెడ్డి వద్ద పని చేస్తున్నారు. వారు తీసే ‘ప్రతిజ్ఞ’ సినిమాకు విలన్‌గా రాజనాలను ఎంపికచేశారు. నెలకు రూ.200/– జీతానికి హెచ్‌ఎం రెడ్డితో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు . పాతికేళ్ల వయసులోనే ‘వద్దంటే డబ్బు’ సినిమాలో ఎన్టీఆర్‌కు మామగా ముసలి జమీందారు పాత్రలో నటించారు.  1966లో ‘మాయా ది మెగ్నిషిమెంట్‌’ అనే హాలివుడ్‌ సినిమాలో నటించి, హాలివుడ్‌లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు. 25 ఏళ్లపాటు విలన్‌గా, హాస్యనటుడుగా తారాజువ్వలా వెలుగొందారు . ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మొదటి నటుడు రాజనాలా, అంటే ఎన్.టి.రామారావు, ఎం.జి.రామచంద్రన్, జె.జయలలిత.రాజనాలాకు ఇతర సినిమా పరిశ్రమ కోలీవుడ్ మరియు బాలీవుడ్లలో మంచి స్నేహితులు ఉన్నారు. మధుమేహంతో బాధపడుతుండడం వల్ల, 1995లో అరకు లోయలో తెలుగు వీర లేవరాలో సినిమాలో పూర్తిస్థాయి పాత్ర పోషిస్తున్నప్పుడు షూటింగ్ సమయంలో గాయపడిన అతని కాలిని తొలగించారు. రాజనాల  1998, మే 21న చెన్నైలో మరణించారు

No comment allowed please