#SouravGanguly : ప‌శ్చిమ బెంగాల్ టైగ‌ర్ కు గుండె పోటు 

Sourav Ganguly : భార‌తీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్య‌క్షుడు, ఇండియ‌న్ క్రికెట్ మాజీ కెప్టెన్ కోట్లాది అభిమానుల‌ను సంపాదించుకున్న సౌర‌బ్ గంగూలీకి ఉన్న‌ట్టుండి గుండె పోటు వ‌చ్చింది.

Sourav Ganguly  : భార‌తీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్య‌క్షుడు, ఇండియ‌న్ క్రికెట్ మాజీ కెప్టెన్ కోట్లాది అభిమానుల‌ను సంపాదించుకున్న సౌర‌బ్ గంగూలీకి ఉన్న‌ట్టుండి గుండె  పోటు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని క్రీడా జ‌ర్న‌లిస్టు బోరియా మ‌జుందార్ వెల్ల‌డించారు. దీంతో ఒక్క‌సారిగా క్రీడా లోకం దాదా ఆరోగ్యం గురించి వాక‌బు చేయ‌డం మొద‌లైంది. అటు రాజ‌కీయ‌, వ్యాపార‌, క్రీడా రంగాల‌కు చెందిన వారంతా దాదా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుతున్నారు. బెంగాలీయులు ముద్దుగా గంగూలీని దాదా అని పిలుచుకుంటారు. మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కెప్టెన్ గా ఉన్న స‌మ‌యంలో భార‌త జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు.

ఇక అక్క‌డి నుంచి డేర్ అండ్ డేషింగ్ ప్లేయ‌ర్ గా వినుతికెక్కాడు. వ్య‌క్తిగ‌త రాజ‌కీయాల‌కు దూరంగా.. అతీతంగా నిక్క‌చ్చిగా ఉండే గంగూలీ (Sourav Ganguly )ఉన్న‌ట్లుండి పాలిటిక్స్ కు ద‌గ్గ‌ర‌య్యాడు. అనుకోని రీతిలో ప్రపంచంలోనే అత్యంత ఆదాయం క‌లిగిన బీసీసీఐకి ప్రెసిడెంట్ గా ఎంపిక‌య్యాడు. ఆయ‌న వ‌చ్చీ రావ‌డంతోనే ప్ర‌క్షాళ‌న స్టార్ట్ చేశాడు. ఏ విష‌య‌మైనా స‌రే కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డం ఆయ‌న‌కే చెల్లింది. ఇక ఆరోగ్యం విష‌యానికి వ‌స్తే త‌న ఇంట్లోని జిమ్ లో య‌ధావిధిగా వ్యాయామం చేస్తుండ‌గా ఉన్న‌ట్టుండి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోన‌య్యారు. హుటాహుటిన దాదాను ఉడ్ ల్యాండ్ష్ ఆస్ప‌త్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స‌ను ప్రారంభించారు. గంగూలీకి గుండె పోటు వ‌చ్చిన‌ట్లు వైద్యులు నిర్దారించారు.

తాజాగా డాక్ట‌ర్ స‌రోజ్ మండ‌ల్ నేతృత్వంలో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. ఆయ‌న‌కు యాంజియో ప్లాస్టీ (Sourav Ganguly )చేయ‌నున్న‌ట్టు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కాగా ఎప్ప‌టిక‌ప్పుడు దాదా ఆరోగ్య ప‌రిస్థితి గురించి బులిటెన్ విడుద‌ల చేయ‌నున్నారు. అన్ని రంగాల‌కు చెందిన అతిర‌థ మ‌హార‌థులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున దాదా కోలుకోవాల‌ని ట్వీట్లు చేస్తున్నారు. కాగా ఇటీవ‌లే మాజీ కెప్టెన్ హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సైతం ఆస్ప‌త్రి పాల‌య్యారు. ఇటీవ‌లే ఆయ‌న కోలుకుని తిరిగి మామూలు మ‌నిషిగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. ప్ర‌స్తుతం గంగూలీ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రో వైపు కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న హెల్త్ గురించి వాక‌బు చేస్తోంది. అటు క్రీడా లోకం ఆయ‌న బాగుండాల‌ని కోరుకుంటోంది.

No comment allowed please