TDP Buddha Venkanna : అయితే విజయవాడ వెస్ట్ లేదంటే ఆ పార్లమెంట్ కావాలంటున్న బుద్దా

పోటీ విషయంలో తగ్గేదేలేదని అంటున్న బుద్దా వెంకన్న

TDP Buddha Venkanna : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ విజయవాడ పశ్చిమలో రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. పశ్చిమ విజయవాడ సీటును కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత బుద్దా వెంకన్న ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ విజయవాడలో సీటు ఇవ్వలేకపోతే కనీసం అనకాపల్లి అసెంబ్లీ సీటు అయినా ఇవ్వాలని బుద్దా వెంకన్న అడుగుతున్నారు.

TDP Buddha Venkanna Comment

పోటీ విషయంలో తగ్గేదేలేదని అంటున్న బుద్దా వెంకన్న…తనకు చంద్రబాబు దేవుడని బుద్దా వెంకన్న అన్నారు. అధినేత తీసుకున్న నిర్ణయాన్ని శిరసా గౌరవిస్తానని చెప్పారు. పార్టీని నమ్ముకొని అంటిపెట్టుకొని ఉన్నవారికి టికెట్ ఇవ్వాలని కోరారు . పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే నా విజ్ఞప్తి అంటూ చెప్పుకొచ్చారు. ఇంటి దుర్గ నుంచి దుర్గ గుడి ఘాట్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించిన బుద్దా వెంకన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Also Read : PM Modi : యువత ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్ ఉందంటున్న మోదీ

Leave A Reply

Your Email Id will not be published!