#Trivikram : డాలర్లు కురిపిస్తున్న డైలాగులు..పంచ్‌లతో రైటర్లు
క్రియేటివిటీకి పదును పెడుతూ సినిమాలను పరుగులు పెట్టిస్తున్నారు. మాటలతో గుండెల్ని పిండేస్తున్నారు. మొదట్లో డైలాగ్ రైటర్స్ గా ప్రారంభించిన వాళ్లల్లో ఎక్కువగా డైరెక్టర్లుగా మారిపోతున్నారు. స్క్రీన్ ప్లే..మాటలు..డైరెక్షన్ అంతా వాళ్లే చూసుకుంటున్నారు. వారిలో త్రివిక్రం శ్రీనివాస్ మొదటి వరుసలో నిలుస్తారు. చాలా సినిమాలను ఆయన పోయెటిక్‌గా ..అద్భుతంగా తీస్తారు.
టెక్నాలజీ మారినా ..అభిరుచులలో మార్పులు చోటు చేసుకున్నా తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా లాభాల బాటల్లో పయనిస్తోంది. పేరుకే చిన్న సినిమాలు అయినప్పటికీ భారీ విజయాలను నమోదు చేసుకుంటున్నాయి. క్రియేటివిటీకి పదును పెడుతూ సినిమాలను పరుగులు పెట్టిస్తున్నారు. మాటలతో గుండెల్ని పిండేస్తున్నారు. మొదట్లో డైలాగ్ రైటర్స్ గా ప్రారంభించిన వాళ్లల్లో ఎక్కువగా డైరెక్టర్లుగా మారిపోతున్నారు. స్క్రీన్ ప్లే..మాటలు..డైరెక్షన్ అంతా వాళ్లే చూసుకుంటున్నారు. వారిలో త్రివిక్రం శ్రీనివాస్ మొదటి వరుసలో నిలుస్తారు. చాలా సినిమాలను ఆయన పోయెటిక్‌గా ..అద్భుతంగా తీస్తారు. ప్రతి కేరెక్టర్ కు ప్రత్యేకమైన వ్యక్తిత్వం వుంటుంది. అలా వుండేలా చేస్తారు త్రివిక్రం. కేవలం ఆయన రాసే మాటల కోసం సినిమాలు చూసే వారున్నారంటే నమ్మగలమా. అవును..వాస్తవం కూడా. మాటల్లో పవర్ వుంటుంది. మన చుట్టూ ఉన్న మనుషులు, ప్రాంతాలే వాటికి ప్రేరణ ఇస్తుంటాయంటారు ఓ సందర్భంలో ఈ డైరెక్టర్.
సంపాదించడం చేత కాని వాడికి ..కూర్చుని ఖర్చు పెట్టే అర్హత లేదంటారు..తండ్రి పాత్రలో చంద్రమోహన్‌తో పలికిస్తారు. ఈ డైలాగ్ అప్పట్లో పేలింది. మనసులో ఉన్న మనిషి పక్కన మామూలుగా తిరగడం చేత కాదు..కారణం లేని కోపం..ఇష్టం లేని గౌరవం..బాధ్యత లేని యవ్వనం ..జ్ఞాపకం లేని వృద్దాప్యం..అనవసరం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు చప్పట్లే చప్పట్లు. పని చేసి జీతం అడగొచ్చు. అప్పు చేసి వడ్డీ అడగొచ్చు. కానీ హెల్ప్ చేసి మాత్రం థ్యాంక్స్ అడగకూడదు. అంత బావుండదు కదూ. బెదిరింపుకు భాష అవసరం లేదు. అర్థమైపోతుంది. విడిపోయినప్పుడే బంధం విలువ తెలుస్తుంది. తండ్రికి..భవిష్యత్తుకు భయపడని వాడు జీవితంలో పైకి రాలేడు.దెయ్యం కంటే భయం మహా చెడ్డది అని ఓ చోట రాస్తాడు. జీవిత సత్యాన్ని మనకి తెలియ చేస్తాడు త్రివిక్రం. ఆడపిల్లల మనస్తత్వం గురించి అద్భుతంగా రాశాడు . ఆడపిల్లలు ఎంత త్వరగా ప్రేమిస్తారో..అంతే త్వరగా మరిచి పోతారు. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగాక ..గుర్తించాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.
ఒక మనిషిని మనం ప్రేమిస్తే..వాళ్లు చేసే తప్పును కూడా మనం క్షమించగలగాలి. ఆడపిల్లలకు గుణాన్ని మించిన ఆస్తి లేదు. బాధలో ఉన్న వాడిని ఎలా ఉన్నావని అడగడం అమాయకత్వం. బాగున్న వాడిని ఎలా ఉన్నావని అడగడం అవసరం. మనం ఇష్టంగా అనుకున్నదే అదే అదృష్టం. బలంగా కోరుకున్నదే భవిష్యత్తు. అతడు సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు నటన అమోఘం. అందులో ప్రతి డైలాగ్ బుల్లెట్‌లా తగిలింది. నిజం చెప్పక పోవడం అబద్దం. అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. మనం తప్పు చేస్తున్నామో లేక ఒప్పు చేస్తున్నామన్నది మన ఆకలికి మాత్రమే తెలుస్తుంది. విడిపోవడం తప్పదు అనుకున్నప్పుడు..అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. వయసు అయిపోయిన హీరోలు రాజకీయ నాయకులై పోయినట్టు. ప్రేమలో ఫెయిల్ అయిన ప్రేమికులు ఫ్రెండ్స్ అయిపోరు.
పవన్ కళ్యాణ్, సమంతలతో తీసిన అత్తారింటికి దారేది సినిమా ఊహించని సక్సెస్ ను స్వంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే డాలర్ల పంట పండించింది. అందులోని డైలాగ్స్ ఇప్పటికీ హైలెట్‌గా నిలిచాయి. రావు రమేష్ ..పవన్ ..మధ్యన మాటలు ఆకట్టుకుంటాయి. అది ఆడపిల్లరా.అభిమానం వుంటుంది..నేను కొడుకుని నాన్న..నాకు కోపం వుంటుంది అంటాడు కొడుకు తండ్రితో ..బాగుండటం అంటే బాగా వుండటం కాదు..నలుగురితో ఉండటం..నవ్వుతూ ఉండటం. ఇంత పొసెస్సివ్ అయితే ఇద్దరు అమ్మాయిల్ని ఎలా కన్నారు చెప్పండి..అయినా వాళ్లు చూపిస్తే గ్లామర్ మేము చూపిస్తే వల్గర్ . ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అంటూ ఎంఎస్ నారాయణ ..రైల్వే స్టేషన్‌లో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అన్న డైలాగ్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆనందం ఎక్కడ దొరుకుతుంది..? డబ్బులోనా..అందమైన అమ్మాయి వెళ్లే ప్లే క్లబ్ లోనా..వాళ్ల శరీరం మీద జారే సబ్బు లోనా..చూడప్పా సిద్ధప్పా నేను సింహం లాంటోణ్ని. అది గడ్డం గీసుకోలేదు. నేను గీసుకోగలను ఒక్కటే తేడా. మిగిలింది అంతా సేమ్ టు సేమ్..అయినా లాస్ట్ పంచ్ మనది అయినప్పుడు ఆ కిక్కే వేరప్పా. సింహం పడుకుంది కదాని చెప్పి జూలు తో జెడేయకూడదురా..అలాగే పులి పలకరించింది కదాని పక్కన నిలబడి ఫోటో తీయించుకోకూడదురోయ్ ..అ..హా..అంటూ పవన్ పలికిన డైలాగ్ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. డాలర్లు వచ్చేలా చేసింది.
ఒక మనిషికి వుంటే కోపం..అదే గుంపుకు వుంటే ఉద్యమం. ద్వేషించడానికి ఒక జీవితం చాలక పోవచ్చు. కానీ ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు. డబ్బులున్న వాళ్లందరు ఖర్చు పెట్టలేరు. ఖర్చు పెట్టిన వాళ్లందరు ఆనందించలేరు. ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు..ఎలా వెళ్లాలో చెప్పటానికి నేనెవర్ని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది..నేను దేవుణ్ని కాదు..మనం మనుష్యులం అని. మనం నమ్మగలిగేవి మాత్రమే నిజాలు. భరించలేనివి అన్నీ అబద్దాలు అయితే బాగుండు. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి..కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలం. కానీ గుండెలో ఉన్న మాటను కేవలం కళ్లతో మాత్రమే చెప్పగలం. కారు కొనడానికి అయిదు లక్షలు అయ్యిందని ..ఎక్కిన ప్రతి వాడిని డబ్బులు అడిగితే ఎలా..అంటాడు బ్రహ్మానందం ఓ సినిమాలో. నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పలేదు. నేను నమ్మాను కాబట్టి చెప్పాను. ఎందుకంటే హనుమంతుడి కన్నా రాముడికి నమ్మకస్తుడు ఎవరుంటారు కనుక.
-కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి పులివెందుల పూల అంగళ్ళు దాక .. కర్నూల్ కొండరెడ్డి బురుజు నుండి అనంతపుర్ క్లోక్ టోవర్ దాకా.. బెల్లారీ గనుల నుండి బెలగావ్ గుహాల దాక.. తరుముకుంటూ వస్తా తల తీసి పారేస్తా- ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు.. వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు.. రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు.. కాని ప్రతి జనరేషన్‌లోనూ ఓ కొత్త థాట్‌ని ముందుకు తీసుకువెళ్లే వాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాడే టార్చ్ బేరర్ అంటారు.. వెళ్తున్నాడు చూశావా? బాలిరెడ్డీ వాడే టార్చ్ బేరర్. జూనియర్ ఎన్టీఆర్..పూజా హెగ్డేతో తీసిన అరవింద సమేత లో త్రివిక్రం కలం మరోసారి తన పవర్ ఏమిటో రుచి చూపించింది. యుద్ధం చేసే సత్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు. 30 ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంతే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. 10 దినాల నాడు అదే కత్తి నువ్ దూసినావంటే.. అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా..వీరా.. నువ్ కత్తి పట్టినట్టు లేదురా.. అది నీ చేతికి మొలిచినట్టు ఉందిరా.
‘వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు..వీరా.. నిన్ను వేలిపట్టి నడిపించాడు.. నువ్ ఇప్పుడు కాటికి నడిపీయాలా.. ‘కొండను చూసి కుక్క మొరిగితే కుక్కకి చేటా? తగ్గితే తప్పేంటి? .. వయెలెన్స్ మా డీఎన్ఏ కాదు.. మీ మీద వచ్చిపడ్డ అత్యవసర పరిస్థితి. నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగుడిని కమ్మేస్తా.. ఊరి చేరేలోపు తరుముకుంటా వచ్చి చంపేస్తా.. మాట్లాడితే మా వాళ్లే కాదు.. శత్రువులు కూడా వింటారు. వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వందడుగులుతో సమానం సార్ తవ్వి చూడండి అని ఎన్టీఆర్ పలికిన డైలాగ్‌లు అదిరిపోయాయి. ‘మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా? ‘కంటపడితే కనికరిస్తానేమో.. ఎంటపట్టానా నరికేస్తా’. పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా? ..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. ఎంతైనా తెలుగు సినిమా చేసుకున్న పుణ్యం త్రివిక్రం కాదంటారా..!
No comment allowed please