#PrabhakarReddy : తెలుగు సినీ చక్రవర్తి.. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి

సినిమాల్లో డైలాగులు చెప్పడం కాదు.. నిజజీవితంలో చేసి చూపించాలి అంటున్న ప్రజలు

ఆయన  పేరు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి.. తెలుగు చిత్ర సీమలో ఆయన తెలియని వారంటూ ఉండరు. నాటి సినిమాల్లో విలన్ పాత్రలకు ప్రసిద్ధి. 1935 అక్టోబరు 8న తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తిలో జన్మించారు. డాక్టర్ చదివి..నటనపై వ్యామోహంతో సినీ పరిశ్రమవైపు వచ్చారు. చివరకు మిగిలింది..సినిమా ద్వారా పరిచయమై..తెలుగు సినిమాల్లో బెస్ట్ విలన్ గా నిలిచిపోయారు..అప్పట్లో సత్యనారాయణ తర్వాత విలన్ ఎవరంటే ప్రభాకర్ రెడ్డి అనే చెప్పాలి..సమాజంలో గొప్పవాడిగా చెలామణీలో ఉంటూ తడిగుడ్డతో గొంతులు కోసే పాత్రలు వేయడంలో ఆయన విలనిజం సరిగ్గా సరిపోయేది..అలా సుమారు 420 చిత్రాల్లో నటించారు.

తర్వాత కాలంలో కొన్ని సినిమాలకు కథలు రాశారు. నిర్మాతగా కూడా కొన్ని చిత్రాల్లో భాగస్వామ్యమయ్యారు. తర్వాత చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ తరలివచ్చినప్పుడు..ఆయన అందరితో వచ్చి ..గచ్చిబౌలిలో పది ఎకరాల స్థలం కొన్నారు. ఆ తర్వాత కాలక్రమంలో..సినీ కార్మికులు తమ సంపాదనలో చాలాభాగం ఇంటి అద్దెలకే పోతుండటంతో.. ముందు తన పది ఎకరాలు దానం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి..మరికొంత స్థలం తీసుకొని చిత్రపురి కాలనీ అని పేరు పెట్టి వారికి స్థలాలు ఇవ్వడంతో..అక్కడ సినీ ఇండస్ట్రీకి చెందిన 24 విభాగాలకు చెందిన వాళ్లు అక్కడ చిన్నచిన్న ఇల్లు కట్టుకొని.. సినీ జీవన ప్రయాణాన్ని హాయిగా సాగించారు.

ఇప్పుడా స్థలం విలువ రూ.500 కోట్లు అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ స్థాయిలో సాయం చేసిన హీరోలు హైదరాబాద్ లో దుర్బణీ వేసి వెతికినా కనిపించరు. అందుకే డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలుగు సినీ చక్రవర్తి అని చెప్పాలి. అక్కడ సినీ కళాకారులు కూడా ఆ చిత్రపురి కాలనీకి డాక్టర్ ప్రభాకర్ రెడి చిత్రపురి కాలనీగా నామకరణం చేసి తమ కృతజ్నతను చాటుకున్నారు.

No comment allowed please