Bapu Ramana Awards : నేడు బాపు రమణల పురస్కార ప్రదానం

Bapu Ramana Awards : డిసెంబర్‌ 15 వ తేదీన బాపూ రమణల అవార్డు పురస్కారం వేడుకని నిర్వహిస్తున్నట్టు బాపురమణల అకాడమీ కార్యదర్శి కళా మిత్ర వేగిరాజు సుబ్బరాజు మీడియాకిచ్చిన ఓ ప్రకటనలో తెలిపారు.

Bapu Ramana Awards : డిసెంబర్‌ 15 వ తేదీన బాపూ రమణల అవార్డు పురస్కారం వేడుకని నిర్వహిస్తున్నట్టు బాపురమణల(Bapu Ramana Awards) అకాడమీ కార్యదర్శి కళా మిత్ర వేగిరాజు సుబ్బరాజు మీడియాకిచ్చిన ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేస్తు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం లో ఆరంభమైన స్నేహ మాధుర్యాల బంధు ప్రాంగణంగా వెలుగొందుతున్న తమ సంస్ధ తరపున ఈ వేడుకని 2015 నుంచి కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికీ తమ సంస్ధ నుంచి 2015లో బాపు అవార్డు ప్రముఖ చిత్ర కారుడు శ్రీ జయదేవ్‌ అందుకోగా రమణ అవార్డు దర్శక తపస్వి కే విశ్వనాధ్‌ అందుకున్నారని, అలాగే  2016లో శ్రీచంద్ర, శ్రీరమణలు, 2017లో సరసి, యండమూరి వీంద్రనాధ్‌లకు ఈ పురస్కారం అందించినట్టు తెలిపారు. ఇక 2018లో సినీ రచయిత   సత్యమూర్తి , నటుడు భరణిలకు 2019లో కార్టునిస్టు శంకర్‌ నారాయణ, దర్శకుడు వంశీలను ఈ పురస్కారాలతో సత్కరించినట్టు వివరించారు.

గోదావరి బండ్‌పై బాపు, రమణల విగ్రహాలు: ఆవిష్కరించిన బాబు | Bapu and ramana  Statues at Godavari Shore - Telugu Oneindia

 

2020 ఏడాదికి గానూ ప్రముఖ చిత్ర కారుడు గోపీని బాపు అవార్డు కోసం, నటుడు, దర్శకుడు, నిర్మాత , రచయిత అయిన ఎల్బీ శ్రీరామ్‌ను ఎంపిక చేసామని చెప్పారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌, బొగ్గుల కుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌ హాల్‌లో ఈ ఇరువురినీ సత్కరించి సన్మానించి, పురస్కారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి, నటులు తనికెళ్లభరణి, రాజీవ్‌ కనకాల, శ్రీమతి శృతి,  ఆలిండియా రేడియో మాజీ డైరెక్టర్‌ ఓలేటి పార్వతీశం,  దర్శకుడు వర ముళ్లపూడి హాజరవుతున్నట్టు వివరించారు.  అలాగే ఈ సందర్భంగా ప్రముఖ నృత్య కళాకారిణి, దివంగత శోభానాయులుకు నీరాజనం అర్పించేలా సత్తారాజు శంకర్‌ నారాయణ పెన్సిల్‌ పెట్రైట్‌‌సలతో రూపొందిన నాట్య రేఖలు డాన్సర్‌‌స ఆఫ్‌ ఇండియా పుస్తకావిష్కరణ జరుగుతుందని దీనిని ఓలేటి హైమవతి మద్దలి ఉషారాణి కి అందిస్తారని సుబ్బరాజు  వివరించారు.

No comment allowed please