Trump Gold Card Visa : ఈబీ-5 వీసా పై మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్

విదేశీ పెట్టుబడిదారులకు "గోల్డ్ కార్డ్" వీసాలు ఇచ్చేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు...

Trump : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టోనాల్డ్ ట్రంప్(Trump) సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి తరిమివేయడమే లక్ష్యంగా ట్రంప్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వివిధ దేశాల నుంచి వలస వచ్చి అక్రమంగా ఉంటున్న వారిని స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను ఒక్కసారిగా అగ్రరాజ్యం వైపు చూసేలా చేసింది. తాజాగా అలాంటి మరో సంచలన నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు.

Trump New Decision

విదేశీ పెట్టుబడిదారులకు “గోల్డ్ కార్డ్(Gold Card)” వీసాలు ఇచ్చేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అమెరికాలో ఐదు మిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెడితే గోల్డ్ కార్డ్ వీసాలు మంజూరు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. పెట్టుబడిదారుల కోసం ఇప్పటికే ఉన్న EB-5 వీసా స్థానంలో దీన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ గోల్డ్ కార్డ్ వీసాలతో శాశ్వతమైన అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. దీని కోసం 35 ఏళ్లుగా అమలులో ఉన్న ఈబీ-5 వీసా విధానానికి స్వస్తి పలకనున్నట్లు చెప్పుకొచ్చారు ట్రంప్. గోల్డ్ కార్డ్ వీసాలతో విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు మరింత ధనవంతులు అవుతారని పేర్కొన్నారు. వారి పెట్టుబడుల ద్వారా అమెరికా పౌరులకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ట్రంప్ తెలిపారు.

అయితే EB-5 వీసా విధానంలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని, అందుకే “ట్రంప్ గోల్డ్ కార్డులు” తీసుకురానున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లట్నిక్ తెలిపారు. ఈ వీసాలు పొందే వారికి గ్రీన్ కార్డులు పొందిన వారి లాగానే అమెరికా శాశ్వత పౌరసత్వం లభిస్తుందని చెప్పారు. మరో రెండు వారాల్లో ట్రంప్ గోల్డ్ కార్డులు అమలులోకి తీసుకురానున్నట్లు మంత్రి లట్నిక్ వెల్లడించారు. ఈబీ-5 వీసాల విషయంలో మోసాలు గుర్తించామని, 2021-2022 సెప్టెంబర్ నెలల మధ్య ఈ వీసాలు పొందిన 8 వేల మంది అక్రమంగా నిధులు పొందినట్లు గుర్తించామని మంత్రి హోవర్డ్ తెలిపారు. అలాంటి మోసాలు అరికట్టేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా, గ్రీస్‌, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, ఇటలీ, స్పెయిన్‌, వంటి 100 పైగా దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటి గోల్డ్ కార్డు వీసాలు జారీ చేస్తున్నాయి.

Also Read : CM Revanth-PM Modi :రాష్ట్ర అభివృద్ధి అంశాలపై ప్రధానితో భేటీ అయిన సీఎం

Leave A Reply

Your Email Id will not be published!