సినీ పరిశ్రమలో నటించే నటీనటుల కే కాకుండా బుల్లితెరలో నటించే నటులకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. చాలామంది సినీ నటీనటులు.. బుల్లితెరలో అడుగుపెడుతున్నారు. సినిమాలకంటే ఎక్కువ స్థాయిలో డైలీ సీరియల్ లో సంపాదించుకుంటున్నారు. ఈ విషయానికి వస్తే బుల్లితెర ప్రభాకర్ తన ఆస్తి విషయంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
సీరియల్ లో నటించే ప్రభాకర్.. ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లలో మెగాస్టార్ గా నిలిచాడు. దాదాపు ఎన్నో సీరియల్ లో నటించి సీనియర్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట బుల్లితెరలో యాహూ షో తో పరిచయమైన ఈయన అప్పుడే ఈటీవీ సుమన్ తో స్నేహంగా ఉండడం వల్ల మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రభాకర్ కొన్ని సినిమాల్లో కూడా నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల బుల్లి తెరకు దూరంగా ఉండగా మళ్లీ బుల్లితెరలో కనిపిస్తున్నాడు. ప్రభాకర్ ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్న వదినమ్మ సీరియల్ లో నటిస్తున్నాడు. కాగా ఈ సీరియల్ స్టార్ మా లో టిఆర్పి విషయంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కార్తీకదీపం ఉండగా.. ఈ సీరియల్ కు కూడా రేటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి.
కాగా ఇటీవలే కొన్ని అంచనాల ప్రకారం ప్రభాకర్ ఆస్తులను లెక్క వేయగా ముందంజలో ఉన్నారు. అంతేకాకుండా సీరియల్ లో వచ్చే పారితోషికం లక్షల్లో ఉన్నాయని తెలుస్తుంది. ఈయన నటిస్తున్న వదినమ్మ సీరియల్ లో ఒక్క ఎపిసోడ్ కు లక్షన్నర వరకు పారితోషికం తీసుకుంటాడు. ఇదే కాకుండా మిగిలిన చానల్స్ లో నటించి 30 లక్షలకు పైగా పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తుంది.
కాగా ప్రభాకర్ రెండు సినిమాలలో దర్శకత్వం వహించాడు. అంతేకాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు తీసుకున్నాడు. కాగా బుల్లితెరలో ఇప్పటి వరకు ఈయన ఆస్తులు లెక్కయేగా.. 10 కోట్లకు పైగా ఉన్నాయని తెలిపారు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉందని తేలింది. మొత్తానికి ఈయన చరాస్తులు కూడగా 15 కోట్ల వరకు ఉందని తేలింది. కాగా బుల్లితెరలో అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న నటులలో మొదటి స్థానంలో మెగాస్టార్ ప్రభాకర్ ఉన్నారని తేలింది.

No comment allowed please