WhatsApp Governance : ఏపీ ప్రజలకు శుభవార్త…161 సర్కారు సేవలు వాట్స్ యాప్ లో..
ఈ ఒప్పందం మేరకు ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్ తీసుకువస్తోంది రాష్ట్ర ప్రభుత్వం...
WhatsApp Governance : ఆంధ్రప్రదేశ్‌లో వాట్సప్ సేవలను మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ప్రారంభించారు. ఇక నుంచి ప్రభుత్వ ధృవపత్రాలన్నీ వాట్సప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వాట్సప్ సేవల కోసం నెంబర్‌ను విడుదల చేశారు మంత్రి లోకేష్. వాట్సప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9552300009ను అనౌన్స్ చేశారాయన. దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్(Whatsapp Governance) ద్వారా పౌర సేవలు అందించనుంది ఏపీ సర్కార్. మొదటి విడతలో 161 సేవలను వాట్సప్ ద్వారా అందించనున్నారు. ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు అందిస్తారు.
AP Govt Starts WhatsApp Governance..
సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వాట్సప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు 2024 అక్టోబరు 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్ తీసుకువస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వేగంగా పౌరసేవలు అందించటం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. సమాచార గోప్యత, వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సప్ గవర్నెన్స్ పని చేస్తుంది.
దేవాదాయశాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డోనేషన్ల సేవల్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లను జారీ చేయనున్నారు. మున్సిపల్ శాఖలో ఆస్తిపన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయించారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సేవలు పొందాలనుకునే వారి కోసం ప్రభుత్వం ఒక నెంబర్ అనౌన్స్ చేసింది. 9552300009 ద్వారా వాట్సప్‌లో ప్రభుత్వ సేవలను పొందవచ్చునని మంత్రి లోకేష్ తెలిపారు.
Also Read : America Flight Collide : అమెరికాలో విమానం, హెలికాప్టర్ ఢీకొని భారీ ప్రమాదం