వ్యాక్సిన్ రావడానికి మరికొంత కాలం: డబ్ల్యూహెచ్ఓ

కరోనా ని తేలికగా చూడవద్దు..వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తం తప్పదు

ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంటికి వచ్చినా.. ఇంకా కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు.  స్పెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ లో 235 మరణించడంతో      ఆ దేశం ఆందోళన చెందుతోంది. ఇవి తాజా పరిస్థితులు ..

భారతదేశంలో నేటికి కోవిడ్ కేసులు 68 లక్షలుగా ఉంటే..అందులో మరణించినవారు 1 లక్ష మంది పైనే ఉన్నారు. రికవరీ అయినవారు 58 లక్షల వరకు ఉన్నారు. అమెరికాలో దగ్గర దగ్గర 76 లక్షల వరకు కోవిడ్ బాధితులు ఉంటే..2 లక్షలమంది పైనే మరణించారు. రికవరీ అయినవారు 30 లక్షల మంది వరకు ఉన్నారు. అక్కడ శీతల ప్రాంతం కావడంతో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బ్రెజిల్ లో 50 లక్షల మంది కోవిడ్ బాధితులు ఉంటే 1 లక్షా 50వేల మంది మరణించారు. 44 లక్షల మంది వరకు రికవరీ అయ్యారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశంలో చెప్పినట్టు ప్రస్తుతం ప్రతి పదిమందిలో ఒకరు కరోనా బారిన పడితే..వ్యాక్సిన్ వచ్చేలోపు ఆ శాతం మరింత పెరుగుతుందని, అందుకని వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూ హెచ్ ఓ హెచ్చరిస్తోంది. ప్రజలు మాత్రం తేలికగా తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చిన తర్వాత ఇబ్బందులు పడేకన్నా..ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే..ఇంటికి,ఊరికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఇబ్బందులు తప్పించిన వారు అవుతామని వారు చెబుతున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!