Polavaram Project : నిర్వాసితులకు పరిహారం చెల్లించ‌కుండా.. పోలవరం ప్రాజెక్టు లో నీళ్లా?

Polavaram Project : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కార్యవర్గ సమావేశం ఈరోజు ఉదయం విజయవాడలోని కస్తూరిబాయి పేట లోని సమాఖ్య కార్యాలయంలో అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు అధ్యక్షతన జరిగింది.

Polavaram Project : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగు నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కార్యవర్గ సమావేశం ఈరోజు ఉదయం విజయవాడలోని కస్తూరిబాయి పేట లోని సమాఖ్య కార్యాలయంలో అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణా రావు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశం అనంతరం ఈరోజు మధ్యాహ్నం సమాఖ్య ప్రధాన కార్యదర్శి పొత్తూరి రామాంజనేయ రాజు తో కలిసి అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణరావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పురోగతిపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు మొదట 41.15 మీటర్ల తొలిదశలో 120 టిఎంసీల నీటి నిల్వ చేస్తామని ప్రకటించారని దీని నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ,నష్టపరిహారం, పునర్ నిర్మాణానికి సంబంధించి రూ 22 వేల కోట్ల పరిహారం ఇచ్చి నిర్వాసితులను కాళీ చేయించవలసి వుండగా ఈ నిధులు కేంద్రం నుంచి తేకుండా పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎలా చేస్తారని ప్రశ్నించారు.గత ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 2019లో కేంద్ర జల శక్తి శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా మండలి (TAC) పోలవరం తుది అంచనా రూ.55,548 కోట్లకు ఆమోద ముద్ర వేసిందని , ఈ తుది అంచనాను కేంద్రంతో ఆమోదింపజేసుకుని నిధులు తేవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. మరొకపక్క ఇప్పటికే గోదావరి నదిపై పట్టిసీమ ఎత్తిపోతల పథకం పోలవరం కుడికాలువ సాగునీటికి అందుబాటులో ఉండగా 35 మీటర్లు డెడ్ స్టోరేజీ నుంచి 800 కోట్లతో మరొక ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందని దీనిమీద రాష్ట్ర ప్రజలకు అనేక అనుమానాలు కలిగి పోలవరం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 194 టీఎంసీలు కాకుండా 120 టీఎంసీలకు కుదించి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ను చంపేసి కుట్ర చేస్తోందని ప్రజలు భావిస్తున్నారని, దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.

ఈ సమావేశంలో
1. పోలవరం ప్రాజెక్టు తుది అంచనా రూ 55,548 కోట్లకు వెంటనే నిధులను కేటాయించాలని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కోరుతూ తీర్మానం.
2. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రి కి వెంటనే తరలించాలని PPA సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ ను కోరుతూ తీర్మానం.
3. కృష్ణా జలాలు వివాదంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర వాటా లో 45 టీఎంసీలు నీటి హక్కు కోల్పోయే ప్రమాదం ఉన్నందున దీనిపై లోతైన అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం.
4. ఆయాకట్టు దారులు, అధికారుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం రెండవ ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు (KRMB) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి వెంటనే విజయవాడకు మార్చాలని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి యుపి సింగ్ గారిని కోరుతూ తీర్మానాలు ఆమోదించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యక్షులు గండి ముసలినాయుడు (విశాఖపట్నం), కార్యదర్శి కర్రీ అప్పారావు (శ్రీకాకుళం), సంయుక్త కార్యదర్శి జాగర్లమూడి అనిల్ బాబు (ప్రకాశం), కోశాధికారి కే సతీష్ నాయుడు ( చిత్తూరు), కార్యవర్గ సభ్యులు రావూరి సుందరరామిరెడ్డి(నెల్లూరు), గుంటుపల్లి వీర భుజంగ రాయలు(గుంటూరు), ఎం బి శ్రీనివాస్ రెడ్డి(కడప), కోటగిరి మహేంద్ర(తూర్పూగోదావరి ), జాస్తి విజయ భూషణ కుమార్ , తుమ్మల లక్ష్మణ రావు(కృష్ణా) తదితరులు పాల్గొన్నారు

No comment allowed please