Mike Tyson : ప్రపంచ బాక్సింగ్ దునియానే ఏలిన ‘మైక్ టైసన్’ యూట్యూబర్ చేతిలో ఓటమి

లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది...

Mike Tyson : ఒకప్పుడు బాక్సింగ్ దునియాను ఏలాడు. తన పంచ్ పవర్‌తో రింగ్‌లో కింగ్ అనిపించుకున్నాడు. అతడితో ఫైట్ అంటే ప్రత్యర్థులు జడుసుకునేవారు. ఆ పిడిగుద్దుల ధాటికి తట్టుకోలేక మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించిన ఆటగాళ్లెందరో. కొరకర చూపులతో అతడు తమ మీదకు వస్తుంటే రింగ్‌లో నిలబడాలంటేనే అపోజిషన్ బాక్సర్లు భయపడేవారు. బరిలో అడుకుపెట్టింది మొదలు మ్యాచ్ పూర్తయ్యే వరకు అవతలి బాక్సర్‌కు కనీసం శ్వాస తీసుకునేంత సమయం కూడా ఇవ్వకుండా పంచులతో ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. కానీ కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడంతా మారిపోయింది. ఏళ్ల పాటు ప్రపంచ బాక్సింగ్‌ను ఏలినోడు ఇప్పుడు విఫల యోధుడిగా నిలబడ్డాడు. అటు రింగ్‌లోనే కాదు.. ఇటు జీవితంలోనూ ఓడాడు. అతడే దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్(Mike Tyson).

Mike Tyson…

లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్‌(Mike Tyson)కు అనూహ్య ఓటమి ఎదురైంది. సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్‌లో దిగిన 58 ఏళ్ల టైసన్ మునుపటి ఉత్సాహం ఆఖరి దాకా చూపించలేకపోయడు. 27 ఏళ్ల యూట్యూబర్ జేక్ పాల్‌తో మ్యాచ్‌లో 74-78 తేడాతో పరాజయం పాలయ్యాడు. బౌట్ స్టార్ట్ అవడానికి ముందు పాల్‌ను చెంపదెబ్బ కొట్టిన దిగ్గజ బాక్సర్.. మ్యాచ్ మీద మంచి ఇంట్రెస్ట్ నెలకొనేలా చేశాడు. అందుకు తగ్గట్లే తొలి రెండు రౌండ్లలో ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ అదే జోరును కంటిన్యూ చేయలేకపోయాడు. థర్డ్ రౌండ్‌లో పుంజుకున్న జేక్ పాల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన టైసన్.. మ్యాచ్‌లోనే కాదు లైఫ్‌లోనూ ఓడాడని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇంతకంటే పతనం లేదని చెబుతున్నారు.దీనికి కొన్ని కారణాలు చూపిస్తున్నారు.

ఒకప్పుడుటైసన్ రింగ్‌లోకి దిగుతున్నాడంటే ఎక్కడలేని ఆసక్తి ఉండేది. దాదాపుగా ఆడిన ప్రతి బౌట్‌లోనూ అతడిదే విజయం. బాక్సింగ్‌లో 50-6 రికార్డు అతడి పేరు మీదే ఉంది. ఈ రికార్డును బట్టి టైసన్ అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. వరుస విజయాలు, వరల్డ్ ఛాంపియన్ ట్యాగ్, ఊహించనంత డబ్బు, ఎక్కడలేని పాపులారిటీ.. ఇవన్నీ అతడ్ని మార్చేశాయి. బాక్సింగ్‌కు 2005లో గుడ్‌బై చెప్పిన తర్వాత అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు అత్యంత ధనవంతులైన క్రీడాకారుల్లో ఒకడిగా ఉన్న టైసన్(Mike Tyson).. ఆ తర్వాత దుర్వ్యసనాల బారిన పడి అంతా పోగొట్టుకున్నాడు. రోజు వారీ అవసరాల కోసం అప్పులు చేసే స్థితికి దిగజారాడు. బాక్సింగ్ రింగ్‌లో తోపుగా పేరు తెచ్చుకున్న టైసన్.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడీ దిగ్గజ బాక్సర్. అతడికి ఏడుగురు సంతానం ఉండటం గమనార్హం. చెడు వ్యసనాలు, వివాహ జీవితంలో ఇబ్బందులు, విడాకులు, ఆర్థిక కష్టాలు.. టైసన్‌ను తెగ ఇబ్బంది పెట్టాయి. రింగ్‌లో సక్సెస్ అయినా.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం అతడ్నో ఫెయిల్యూర్‌గా మార్చేశాయి.

ఒకప్పుడువరల్డ్ బాక్సింగ్‌ను ఏలిన ఈ రారాజు.. ఇప్పుడు ఒక యూట్యూబర్ చేతిలో ఓడటం గమనార్హం. వయసు, ఎనర్జీలో ఉన్న తేడాల వల్ల టైసన్ ఓడిపోయి ఉండొచ్చు. కానీ అతడు ఈ బౌట్‌కు రావడమే పెద్ద ఆశ్చర్యం. ఒకప్పుడు తోపు బాక్సర్లను కూడా నీళ్లు తాగినంత ఈజీగా మట్టికరిపించినోడు.. ఇప్పుడో యూట్యూబర్‌తో ఆడటానికి ఒప్పుకోవడమే అసలు ఓటమి అని అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఈ బౌట్‌లో తలపడటం కోసం టైసన్‌(Mike Tyson) సుమారు రూ.168 కోట్లు పొందాడని తెలుస్తోంది. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడం వల్లే బచ్చా బాక్సర్‌తో ఆడేందుకు అతడు అంగీకరించాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని మించిన ఓటమి లేదని చెబుతున్నారు.

Also Read : Nara Lokesh : చిన్నాన్న మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!