అద్భుతం..సందేశాత్మ‌కం..నో సే ఎస్..టు నో

యూట్యూబ్ పుణ్య‌మా అని ఎన్నో ల‌ఘు చిత్రాలు వ‌స్తున్నాయి. కొన్ని మ‌న‌ల్ని క‌ట్టి ప‌డేస్తే..ఇంకొన్ని వినోదాన్ని పంచితే..మ‌రికొన్ని మాత్రం గుండెల్ని హ‌త్తుకునేలా చేస్తున్నాయి. టాలెంట్ వుండ‌డ‌మే కాదు దానిని ఎలా స‌ద్వినియోగం చేసుకోవాలో చెప్పేసే సందేశాత్మాక ల‌ఘు చిత్రాలు రావ‌డం అభినంద‌నీయం. ఇలాంటి కోవ‌లో 2018లో వ‌చ్చిందే నో సే ఎస్ టు నో షార్ట్ ఫిలిం. కాలేజీ నేప‌థ్యంగా సాగే ఇతివృత్తం. ఆక‌ట్టుకునే ఆలోచింప చేసే మాట‌లు. రెండు గ్రూపుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు. అందులో భాగంగా అనుకోకుండా ఓ స్టూడెంట్ లీడ‌ర్ కు ఎదుర‌య్యే అమ్మాయి. ఇక్క‌డే ద‌ర్శ‌కురాలు మాధ‌వి పాములకు ఉన్న క్రియేటివిటీకి అద్దం ప‌డుతుంది.
అచ్చం తెలుగుద‌నం వుట్టి ప‌డేలా ..కుంద‌న‌పు బొమ్మ‌లా క‌నిపించే ప్ర‌ధాన పాత్ర‌లో లీన‌మైన తీరు క‌ట్టిప‌డేస్తుంది.ఎంత చ‌క్క‌ద‌నం..స్టార్టింగ్ లోనే త్రివిక్ర‌మ్ సినిమాలోని మ‌ధురాపురి పాట‌కు ఆమె చేస్తున్న నృత్యం ..ఆ క‌ళ్లు మ‌నోడిని అమాంతం క‌ట్టి ప‌డేస్తుంది. ఎలాంటి భేష‌జాలు లేకుండానే గ్యాంగ్ లీడ‌ర్ నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్ర‌పోజ్ చేస్తాడు. ఇదే టైంలో ఇంకో స్టూడెంట్ తానూ ల‌వ్ చేస్తున్నాన‌ని రెండేళ్ల‌యినా వేచి చూస్తాన‌ని అంటాడు. అంతే కాదు నువ్వూ నేను బాగా చ‌దువుకుని అమెరికా వెళ్లి సెటిల్ అవుదామ‌ని చెపుతాడు. అక్క‌డితో ఇంత‌కూ ఈ హీరోయిన్ ఇద్ద‌రిలో ఎవ‌రికి ఓకే చెబుతుంద‌న్న‌ది చివ‌రి దాకా స‌స్పెన్స్ కొన‌సాగుతుంది.
ఇంత‌లో ఆమె ఎక్క‌డున్నా అక్క‌డికి వెళతాడు. చివ‌రికి కాళ్లు ప‌ట్టుకుంటాడు. ఇంకొక రోజు మాత్ర‌మే ఉంద‌ని గుర్తు చేస్తాడు. ఇదే స‌మ‌యంలో ఈ అమ్మాయి అత‌డిని పరీక్షిస్తుంది. నిజాయితీగా ఆలోచిస్తుంది. అంతేనా ప్రేమిస్తాన‌ని అంటే ఎందుకు ఒప్పుకోవాలి. అని ఓ నిర్ణ‌యానికి వ‌స్తుంది. అత‌డి అల‌వాట్ల గురించి డేర్ గా చెప్పేస్తుంది. మ‌నోడికి ఉన్న అల‌వాట్ల‌ను చీల్చి చెండాడుతుంది. వాళ్ల స్నేహితులు ఎలాంటి వారో అత‌డి ముందే క‌డిగేస్తుంది. దీంతో నువ్వు ప్రేమిస్తున్నావా లేక న‌న్ను టార్గెట్ చేస్తున్నావా అంటూ నిల‌దీస్తాడు అమ్మాయిని. ఒక రోజంతా తాగి త‌న‌లో తాను మ‌ధ‌న ప‌డ‌తాడు. ఇక నీ టార్చ‌ర్ భ‌రించ‌లేనంటూ..నీతో వేగ‌లేనంటూ..ఆమె ముందే వాపోతాడు.
నీకో దండం అంటూ వెళ్లిపోతాడు..నీకు ఐ ల‌వ్ యూ చెప్పాక నాలో నేను లేకుండా పోయానంటాడు..ఇక న‌న్ను వ‌దిలేయంటూ సాగి పోతాడు. ఆమె మాత్రం హాయిగా న‌వ్వుకుంటుంది. త‌న వారితో ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటుంది. ఇదో సందేశాత్మ‌క చిత్రం..అంత‌కంటే మ‌న‌ల్ని హెచ్చ‌రిస్తుంది. ప్రేమించ‌వా..ప్రేమిస్తానంటూ వెంట ప‌డే మ‌గ మ‌హరాజుల‌కు ఓ క‌నువిప్పు ఈ మూవీ..ఇలాంటి స‌బ్జెక్టును ఎంచుకుని ఫిలిం తీసిన మాధ‌విని అభినందించ‌కుండా ఉండ‌లేం. బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే సంగీతం బావుంది. పాత్ర‌ల ఎంపిక‌..న‌టుల ప‌నితీరు గుడ్. అన్నిటికంటే ..ప్రేమికురాలి పాత్ర‌లో రూప ఒదిగి పోయింది. మ‌నల్ని క‌ట్టి ప‌డేస్తుంది. వీలైతే మీరూ వెత‌కండి యూట్యూబ్ లో చూడండి.

No comment allowed please