Amit Shah : ‘అగ్నిపథ్ వీరుల’కు 10 శాతం రిజర్వేషన్
ప్రకటించిన కేంద్ర హోం శాఖ మంత్రి
Amit Shah : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలతో అట్టుడుకుతోంది దేశం. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది కేంద్రం.
ఇప్పటికే కాల్పుల మోతతో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ అనే నిరుద్యోగి చని పోయాడు. దేశ వ్యాప్తంగా పలు రైళ్లను తగులబెట్టారు.
బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. నిరసనలు వెల్లువెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా రైల్వే శాఖ 234 రైళ్లను రద్దు చేసింది. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అగ్నిపథ్ పై అగ్గి రాజు కోవడంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్ లు ) , అస్సాం రైఫిల్స్ లో అగ్ని వీర్ లకు 10 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రకటించారు.
అంతే కాకుండా రెండు పారా మిలటరీ బలగాల్లో భర్తీ కోసం అగ్ని వీర్ లకు సూచించిన గరిష్ట ( నిర్దేశించిన ) వయో పరిమితి కంటే మూడేళ్లు అదనపు వయో పరిమితి సడలింపు ఇచ్చింది కేంద్ర మంత్రి సూచనల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
అగ్నివీర్ లోని మొదటి బ్యాచ్ కు నిర్దేశించిన గరిష్ట వయో పరిమితి కంటే 5 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుందని పేర్కొంది.
బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ , శాస్త్ర సీమా బల్ , సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ విభాగాలలో 73,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
Also Read : రాకేశ్ కుటుంబానికి కేసీఆర్ భరోసా