100 Families Return : తిరిగి చేరుకున్న 100 కుటుంబాలు
నోయిడా ట్విట్ టవర్స్ కూల్చివేత
100 Families Return : దేశ వ్యాప్తంగా అత్యంత ఆసక్తిని రేకెత్తించింది యూపీలోని నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కార్యక్రమం. గత 9 సంవత్సరాలుగా ఈ జంట టవర్లను కూల్చి వేసేందుకు యుద్దం నడిచింది.
కింది కోర్టు నుంచి పై కోర్టు దాకా వెళ్లింది. చివరకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చి వేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కూల్చివేత కార్యక్రమం జరిగింది.
మొత్తం కూల్చివేతలో పేరుకు పోయిన శిథిలాలు, మట్టి, ఇతర వాటిని తీసేందుకు కనీసం మూడు నెలలకు పైగా పడుతుందని అంచనా.
రెండు టవర్లకు సంబంధించి 29, 32 అంతస్తులను కూల్చి వేయడంతో ముందు జాగ్రత్త చర్యగా చుట్టు పక్కల ఉన్న 100 కుటుంబాలను ఖాళీ చేయించారు నోయిడా నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు.
భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. భారీ కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్విన్ టవర్లను కూల్చి వేశారు. కూల్చివేత సందర్భంగా ఖాళీ చేసిన కుటుంబాలన్నీ బిక్కు బిక్కు మంటూ మళ్లీ తిరిగి తమ స్వస్థలాలోకి (100 Families Return) చేరుకున్నాయి.
కూల్చేవేతకు ముందు ఎమరాల్డ్ కోర్ట్ , ఏటీఎస్ విలేజ్ సొసైటీల నుండి 5,000 వేల మందికి పైగా ప్రజలు ఖాళీ చేశారు. బయటకు వెళ్లి పోయిన వారంతా ఆదివారం అర్ధరాత్రి దాకా వచ్చారు.
తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. అపెక్స్ టవర్ లో 32 అంతస్తులు ఉండగా సెయానే టవర్ లో 29 అంతస్తులు ఉన్నాయి. కేవలం 9 సెకన్లలోనే నేలమట్టం చేశారు.
ఇదిలా ఉండగా తిరిగి వచ్చిన వారంతా తమ ఇళ్లు భద్రంగానే ఉన్నాయని, సోమవారం గ్యాస్ సరఫరా కొనసాగుతుందని చెప్పారని స్థానికులు తెలిపారు.
Also Read : ఎన్వీ రమణపై ఒమర్ అబ్దుల్లా ఫైర్