Bus Catches Fire : నాసిక్ బ‌స్సులో మంట‌లు 11 మంది మృతి

38 మందికి గాయాలు..ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం

Bus Catches Fire : మ‌హారాష్ట్ర‌లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది. నాసిక్ లో బ‌య‌లు దేరిన బ‌స్సులో(Bus Catches Fire)  మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఊపిరాడ‌క 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌లో 38 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్ష‌త గాత్రుల‌ను హుటా హుటిన ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ప్ర‌మాద ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే స‌హాయ‌క బృందాలు, పోలీసులు , అగ్నిమాప‌క సిబ్బంది చేరుకున్నారు. మంట‌ల‌ను ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. ఇంకా మంట‌లు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఇంకా మంట‌లు అదుపులోకి రాక పోవ‌డంతో ఫైరింగ్ ఇంజ‌న్లు మ‌రికొన్ని అక్క‌డికి చేరుకున్నాయి.

నాసిక్ లో చోటు చేసుకున్న ఈ బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న శ‌నివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బ‌స్సులో చోటు చేసుకున్న మంట‌ల్లో మృతి చెందిన వారి సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇదిలా ఉండ‌గా నాసిక్ లోని ఔరంగాబాద్ రోడ్డులో డీజిల్ ర‌వాణా చేస్తున్న ట్ర‌క్కును ఢీకొన‌డంతో బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి.

చ‌ని పోయిన వారిలో ఎక్కువ మంది బ‌స్సులోని ప్ర‌యాణికుల్ని , గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు నాసిక్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ అమోల్ తాంబే తెలిపారు. అగ్ని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు చెప్పారు.

అగ్నిమాప‌క అధికారులు మంట‌ల్ని ఆర్పేందుకు ప్ర‌య‌త్నించ‌గా పెద్ద ఎత్తున మంట‌లు బ‌స్సును(Bus Catches Fire)  చుట్టుముట్టిన‌ట్లు చెప్పారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో స‌భ్యుడిని కోల్పోయిన కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికీ రూ. 2 ల‌క్ష‌ల చొప్పు, గాయ‌ప‌డిన వారికి రూ, 50,000 సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి కుటుంబీకులు ఒక్కొక్క‌రికీ రూ. 5 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట ప‌రిహారం అంద‌జేస్తామ‌ని సీఎం ఏక్ నాథ్ షిండే ప్ర‌క‌టించారు.

Also Read : ఎక్క‌డి నుంచైనా భార‌త్ ఆయిల్ కొనుగోలు

Leave A Reply

Your Email Id will not be published!