Twitter Shock : ట్విట్టర్ కు షాక్ 1,200 మంది గుడ్ బై
ఐటీ నిపుణులు ఉండాలని కోరిన మస్క్
Twitter Shock : ట్విట్టర్ కు కోలుకోలేని షాక్ తగిలింది. తాజాగా 1,200 మంది ఉద్యోగులు గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ట్విట్టర్ నుంచి 7,500 మందిలో 4 వేల మందిని తొలగించాడు మస్క్. వీరితో పాటు కాంట్రాక్టు సిబ్బంది 5,000 వేల మందిని సాగనంపాడు. వర్క్ ఫ్రం హోమ్ ఉండదని ఎవరైనా ఆఫీసుకు రావాల్సిందేనంటూ స్పష్టం చేశాడు.
మొత్తంగా ట్విట్టర్ లో(Twitter Shock) గందరగోళానికి తెర తీశాడు మస్క్. అసలు ఆఫీసులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. $44 బిలియన్ల భారీ ధరకు ట్విట్టర్ కొనుగోలు చేసిన టెస్లా సిఇఓ ఊహించని రీతిలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ షాక్ ఇస్తూ వస్తున్నారు. మరో వైపు ఇమెయిల్స్ లో వాయిస్ మెస్సేజ్ పంపించాడు.
ఎవరైనా సరే కష్టపడి పని చేయాలని లేక పోతే వెళ్లి పోవాలని అల్టిమేటం ఇచ్చాడు. ఇదే సమయంలో ఉన్నట్టుండి ఉద్యోగులు వీడడం, ట్విట్టర్ కు సమాధి కట్టడం, మరో వైపు తీవ్ర ఆరోపణలు రావడంతో కొంచెం తగ్గినట్టు అనిపిస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లి వ్యక్తిగతంగా ట్విట్టర్ కార్యాలయంలో ఉండమని కోరినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా వందలాది మంది ఉద్యోగులు రాజీనామా చేయడంతో ట్విట్టర్ తన కార్యాలయాలను శుక్రవారం మూసి వేసింది. ఎవరైనా సరే శనివారం మధ్యాహ్నం వరకు సమాచారం ఇవ్వాలని సూచించాడు. బే ఏరియాకు చేరుకోలేని వారు కుటుంబ అత్యవసర పరిస్థితులు ఉన్న వారు మాత్రమే హాజరు నుండి మినహాయించ బడతారని ఎలాన్ మస్క్ పేర్కొన్నాడు.
Also Read : నాలుగు ఎయిర్ లైన్స్ లు ఒకే గూటికి