Ashok Gehlot : గుజ‌రాత్ ఎన్నికల్లో 125 సీట్లు ఖాయం

కాంగ్రెస్ క్యాంపెయిన‌ర్ సీఎం గెహ్లాట్

Ashok Gehlot : గుజ‌రాత్ లో రాజ‌కీయం మ‌రింత వేడిని పుట్టిస్తోంది. గ‌త మూడు ద‌శాబ్దాలుగా ఇక్క‌డ భార‌తీయ జ‌న‌తా పార్టీ కొలువు తీరి ఉంది. ప్ర‌త్యేకించి ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ చంద్ర షాతో పాటు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ప‌ట్టున్న ప్రాంతం. ఇప్ప‌టి వ‌ర‌కు 27 ఏళ్ల పాటు కంటిన్యూగా గుజ‌రాత్ లో పాగా వేసింది బీజేపీ.

ఇదిలా ఉండ‌గా ఈసారి ఎలాగైనా రాజ‌స్థాన్ కోట‌లో పాగా వేయాల‌ని కాంగ్రెస్ ప్లాన్ వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ను ఎంపిక చేసింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అంతా తానై న‌డుపుతున్నారు గుజ‌రాత్ సీఎం , కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు అశోక్ గెహ్లాట్.

సోమ‌వారం సీఎం అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ పాల‌న‌తో ప్ర‌జ‌లు విసుగెత్తి పోయార‌ని అన్నారు. అందుకే ప్ర‌త్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ప‌ట్టు క‌లిగిన కాంగ్రెస్ పార్టీ అయితే బెట‌ర్ అని ఆలోచిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు అశోక్ గెహ్లాట్(Ashok Gehlot). తాము ఇప్ప‌టికే కింది స్థాయిలో మ‌రింత పార్టీని బ‌లోపేతం చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ఇన్నేళ్ల బీజేపీ పాల‌న‌లో ఏం చేసిందో చెప్ప‌లేక పోతోందంటూ ఎద్దేవా చేశారు. గుజ‌రాత్ లో తాము 125 సీట్లు గెలుచు కోవ‌డం ఖాయ‌మ‌ని అశోక్ గెహ్లాట్ జోష్యం చెప్పారు. మోర్బీ ఘ‌ట‌న పాపం ప్ర‌భుత్వానిదేన‌ని ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జితో లేదా రిటైర్డ్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో విచార‌ణ చేప‌ట్టాల‌ని సీఎం డిమాండ్ చేశారు.

Also Read : రాజీవ్ హంత‌కుల విడుద‌ల‌పై దావా

Leave A Reply

Your Email Id will not be published!