Hapur Blast : యూపీ ఫ్యాక్టరీలో పేలుడు 13 మంది మృతి
హాపూర్ లోని కెమికల్ ఫ్యాక్టరీలో ఘటన
Hapur Blast : యూపీలో భారీ పేలుడు సంభవించింది. రాష్ట్రంలోని హాపూర్(Hapur Blast) లో ఈ ఘటన చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన పై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు దేశ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ . సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
మరణించిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉన్నతాధికారులు ఘటన స్థలంలో ఉన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాయిలర్ పేలడంతో అక్కడికక్కడే 13 మంది కార్మికులు మరణించారు.
మరికొందరు గాయపడినట్లు తెలిపారు. సంఘటన జరిగినప్పుడు దేశ రాజధానికికి 80 కిలోమటర్ల దూరంలో ఉన్న ధోలానా లోని యుపీఈఎస్ఐడీసీ పారిశ్రామిక ప్రాంతంలోని ఫ్యాక్టరీలో 30 మంది ఉన్నారు.
పేలుడు తాకిడికి చుట్టు పక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బ తిన్నాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు మూడు గంటల సమయం పట్టింది.
గాయపడిన వారిని చికిత్స కోసం తరలించామని హాపూర్(Hapur Blast) పోలీస్ సూపరింటెండెంట్ దీపక్ భుకర్ తెలిపారు. కాగా ఈ ఫ్యాక్టరీకి ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసేందుకు లైసెన్స్ ఇచ్చారు.
ఏం జరిగిందనే దానిపై విచారణ జరుపుతున్నాం. ఫోరెన్సిక్ బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. నమూనాలను సేకరిస్తున్నాయి. ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు చేయిస్తున్నామని హాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపమ్ తెలిపారు.
యాజమాన్యం అలసత్వం వల్లే ఇది జరిగిందని తెలిపారు. విచారణలో తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : బంగ్లా కంటైనర్ లో ప్రమాదం 25 మంది మృతి