Pakistan Floods : ప్ర‌కృతి ప్ర‌కోపం పాకిస్తాన్ అత‌లాకుత‌లం

వ‌ర‌ద‌ల బీభ‌త్సం 1,300 మంది దుర్మ‌ర‌ణం

Pakistan Floods :  ప్ర‌కృతి విల‌య తాండ‌వానికి కోలుకోలేని షాక్ త‌గిలింది పాకిస్తాన్ కు. ఇప్ప‌టికే ఆ దేశం తీవ్ర ఆర్థిక ప‌ర‌మైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వినాశ‌క‌ర‌మైన వ‌ర‌ద‌ల తాకిడికి(Pakistan Floods) 1,300 మంది మ‌ర‌ణించారు.

5 లక్ష‌ల మందికి పైగా నిరాశ్ర‌యుల‌య్యారు. గ‌త 24 గంట‌ల్లో 29 మందికి పైగా మ‌ర‌ణించారు. దీంతో గ‌త నెల జూన్ నెల నుంచి ఎడ తెరిపి లేకుండా

కురుస్తున్న వ‌ర్షాల దెబ్బ‌కు మృతుల సంఖ్య 1,290కి చేరుకుంద‌ని నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ అథారిటీ వెల్ల‌డించింది.

పాకిస్తాన్ దేశ ప్ర‌భుత్వం పూర్తిగా అల‌ర్ట్ అయ్యింది. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధానమంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ ఆదేశించారు. త్వ‌రిత‌గ‌తిన

కోలుకునేందుకు అల్లాహ్ ను ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు.

ఇదే స‌మ‌యంలో భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు

కావాల‌న్నా తాము సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

మాన‌వ‌తా దృక్ఫ‌థంతో స్పందించిన ప్ర‌ధాన మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు పాకిస్తాన్ పీఎం. ఓ వైపు స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. మ‌రో వైపు వ‌ర‌ద‌ల బీభ‌త్సానికి నిరాశ్ర‌యులైన వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఇది క‌నీవిని ఎరుగ‌ని ప్ర‌కృతి సృష్టించిన బీభ‌త్సంగా ఆ దేశం పేర్కొంది. యావ‌త్ ప్ర‌పంచం కూడా తీవ్ర సంతాపం వ్య‌క్తం చేసింది. దేశంలోని అతి పెద్ద

ప్రాంతాలు నీట మునిగాయి.

ద‌క్షిణాన బ‌లూచిస్తాన్ , ఖైబ‌ర్ ఫ‌క్తుంఖ్వా , సింధ్ ప్రావిన్స్ లు ప్ర‌భావితానికి గుర‌య్యాయి. సింధ్ లో 180 మందికి పైగా మ‌ర‌ణించారు. ఖైబ‌ర్ లో 138

మంది, బ‌లూచిస్తాన్ లో 125 మంది ప్రాణాలు కోల్పోయారు.

వ‌ర‌ద‌ల కార‌ణంగా క‌న‌సం 14,68,019 ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. 7, 36, 459 ప‌శువులు కొట్టుకు పోయాయి. ఫ్రాన్స్ తో పాటు ఇత‌ర దేశాల నుంచి

సాయం అందుతోంది పాకిస్తాన్ కు.

Also Read : ఆర్థిక రంగంలో భార‌త్ భ‌ళా

Leave A Reply

Your Email Id will not be published!