Morbi Bridge Collapse : 132 మందిని మింగిన వంతెన
గుజరాత్ లో మహా విషాదం
Morbi Bridge Collapse : నిన్న సియోల్ ఘటన మరిచి పోక ముందే ఇవాళ భారత దేశంలో మహా విషాదం అలుముకుంది. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా 132 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. 150 ఏళ్ల కు పైగా చరిత్ర కలిగిన మోర్బీలో వంతెన(Morbi Bridge Collapse) ఉన్నట్టుండి కూలి పోయింది.
ఇదిలా ఉండా కేబుల్ బ్రిడ్జి కూలిన సమయంలో దానిపై 500 మందికి పైగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే గుజరాత్ రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రిస్క్యూ ఆపరేషన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ప్రాణాలు పోకుండా మరికొందరిని రక్షించే ప్రయత్నం చేశాయి.
ఇప్పటి వరకు 177 మందిని రక్షించారు. పలువురు మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన వారిలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం ప్రకటించాయి. వంతెన కూలిన ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేపట్టనుంది.
ఈ ఘటనలో ఇంకొంత మందిని రక్షించేందుకు సహాయక సిబ్బంది వెతుకుతోంది. రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారం సాయంత్రం 6.42 గంటలకు కుప్ప కూలింది. ఛత్ పూజ కోసం కొన్ని ఆచారాలు నిర్వహించేందుకు 500 మంది గుమిగూడారు.
ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు సైన్యం, నావికా దళం, వైమానిక దళం కూడా రంగంలోకి దిగాయి. మచ్చు నదిపై వంతెన పునర్నిర్మాణం కోసం 7 నెలలుగా మూసి వేశారు. నూతన సంవత్సరం అక్టోబర్ 26న తిరిగి తెరిచారు.
Also Read : పౌరసత్వ చట్టం సవరణపై కీలక తీర్పు